గాంధీలోవాటర్ ప్లాంట్లు ప్రారంభం

గాంధీలోవాటర్ ప్లాంట్లు ప్రారంభం

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​ గాంధీ దవాఖానలో మంచుకొండ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యూరీఫైడ్​ వాటర్​ సెంటర్లను సూపరింటెండెంట్ ప్రొఫెసర్​ ఎన్​.వాణి శుక్రవారం ప్రారంభించారు. హాస్పిటల్​కు వచ్చే వారికి ఉచితంగా ఫిల్టర్​ వాటర్​ను అందించడంపై మంచుకొండ ఫౌండేషన్​ నిర్వాహకులను అభినందించారు. 

ఇప్పటి వరకు వంద లీటర్ల కెమెసిటీ కలిగిన 20 యూనిట్లు, 300 లీటర్ల కెపాసిటీ కలిగిన 4 యూనిట్లు, డాక్టర్లకు 12 లీటర్ల కెపాసిటీ కలిగిన 25 ఆర్​వో యూనిట్లను ఏర్పాటు చేశామని, మరో 25 ఆర్​వో యూనిట్లను త్వరలో ఏర్పాటు చేస్తామని ఫౌండేషన్​ చైర్మన్​ మంచుకొండ వరుణ్​ కుమార్​ తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్​ కోఆర్డినేటర్​ శ్రవన్​, సిబ్బంది మల్లేశం, సతీశ్​ పాల్గొన్నారు.