వెంగళరావు నగర్‎లో నీటి ఎద్దడి.. బుక్​చేసిన వెంటనే ట్యాంకర్లు సప్లయ్ చేయాలని రిక్వెస్ట్

వెంగళరావు నగర్‎లో నీటి ఎద్దడి.. బుక్​చేసిన వెంటనే ట్యాంకర్లు సప్లయ్ చేయాలని రిక్వెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: గతంలో ఎన్నడూ లేని విధంగా వెంగళరావునగర్, మధురానగర్, సిద్ధార్థ నగర్, జవహర్ నగర్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి ఏర్పడిందని స్థానికులు తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, బోర్ల నుంచి చుక్క నీరు రావడం లేదని చెప్పారు. రోజు విడిచి రోజు నల్లా నీళ్లు వస్తున్నాయని, అది కూడా గంటన్నర మాత్రమే విడుస్తున్నారని వాపోయారు. 

బుధవారం యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ పి.వి.రవిశేఖర్ రెడ్డి, వెంగళరావు నగర్ కాలనీ పెద్దలు వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రకాశ్‎ను కలిసి నీటి సమస్యను వివరించారు. బుక్​చేసిన వెంటనే వాటర్ ట్యాంకర్లు వచ్చేలా చూడాలని కోరారు. అలాగే సరిపడా నీళ్లు వదలాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులు రంగారావు, సారంగరావు, లక్ష్మీకాంతారావు, అశోక్ కుమార్, గౌస్ ఖాన్, నాగరాజు, సాంబయ్య, ప్రసాద్ రావు పాల్గొన్నారు.