
నీళ్లు, నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. సంగమేశ్వరం దగ్గర ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడుతున్నారని కాంగ్రెస్ చెప్పిన కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఖమ్మం, నల్గొండ జిల్లాలు నీటి కష్టాలు పడుతాయి అని కూడా చెప్పామని తెలిపారు. నీటి ప్రయోజనాల కంటే ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఆరాటమన్నారు.
పోతిరెడ్డి పాడు ఆపాలని పోరాటం చేసింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలన్న భట్టి..అప్పుడు నువ్వెక్కడ వున్నావని.. కేసీఆర్ ను ప్రశ్నించారు. పోతిరెడ్డి పాడు పాపం కేసీఆర్ దేనన్నారు. ఎన్టీఆర్ టైం లో కరువు మంత్రిగా ఉండి ఆలోచన చేసింది కేసీఆరేనన్నారు. పాలమూరు,డిండి మీరు మొదలు పెట్టారు.. కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికైన నీళ్లు ఇచ్చారా అని అన్నారు. ఆ నాడు కృష్ణ నదిపై కాంగ్రెస్ పార్టీ 15 లక్షల 50వేల ఎకరాలకు నీళ్లివ్వడానికి వివిధ ప్రాజెక్టులను చేపట్టిందన్నారు. ఆయకట్టుల ద్వారా మరికొన్ని లక్షలు సాగుకు నీరందించామని తెలిపారు భట్టి.
అక్రమ ప్రాజెక్టుల ద్వారా మొత్తం..29 లక్షల ఎకరాలు బీడు పారే అవకాశం వుందన్నా..కృష్ణ నీళ్ల కోసం రాజీనామాలు చేస్తామనడం డ్రామా అన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి చూపించాలంటూ డిమాండ్ చేశారు.మేం పోరాటం చేస్తామని అంటే.. మా నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారన్నారు. తెలుగు గంగ పేరుతో తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి తెరలేపింది అప్పటి తెలుగు దేశం సర్కారేనన్నారు.