వాటర్ ట్యాంకర్ బుకింగ్..SMS సేవలకు అంతరాయం..IVRS‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా బుక్చేసుకోవాలన్న వాటర్బోర్డ్

వాటర్ ట్యాంకర్ బుకింగ్..SMS సేవలకు అంతరాయం..IVRS‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా బుక్చేసుకోవాలన్న వాటర్బోర్డ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జంట నగరాల్లో వాటర్ ట్యాంకర్ బుకింగ్​కు సంబంధించిన ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంఎస్ సేవలు (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీసీ) లింక్ అంతరాయం కారణంగా తాత్కాలికంగా పని చేయడం లేదని వాటర్ బోర్డు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో  తెలిపారు.  వినియోగదారులు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ట్యాంకర్ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం ఐవీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ (ఐవీఆర్ఎస్) సేవలను వినియోగించుకోవాలని సూచించారు. టెక్నికల్​టీమ్స్​సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.