కంటోన్మెంట్ విలీనానికి కట్టుబడి ఉన్నం: మంత్రి శ్రీధర్ బాబు 

కంటోన్మెంట్ విలీనానికి కట్టుబడి ఉన్నం: మంత్రి శ్రీధర్ బాబు 

పద్మారావునగర్, వెలుగు: కంటోన్మెంట్ నివాస ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్‎లో విలీనం చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు తీసుకెళ్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గురువారం రాత్రి అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయాలన్న స్థానిక ప్రజల దీర్ఘకాలిక కోరికను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. 

పౌర సేవలు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తేనే ఈ ప్రాంతం ఇతర మున్సిపల్ ఏరియాల మాదిరిగా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు మహేంద్ర హిల్స్​లో వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు స్థానిక ఎమ్మెల్యే శ్రీగణేశ్ కంటోన్మెంట్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.