ప్రతి ఊరిలో ప్లే గ్రౌండ్​ ఏర్పాటు చేస్తున్నాం

ప్రతి ఊరిలో ప్లే గ్రౌండ్​ ఏర్పాటు చేస్తున్నాం
  • పటాన్​చెరులో ఏడున్నర కోట్లతో నిర్మించిన స్టేడియం బాగుంది.. 
  • రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ కడుతాం.. 
  • స్టేడియం ప్రారంభంలో మంత్రి హరీశ్​రావు

పటాన్​చెరు, వెలుగు : గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని  మంత్రి హరీశ్​రావు అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి ఊరిలో ప్లే గ్రౌండ్​ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణంలో కొత్తగా రూ.3 కోట్ల 85 లక్షలతో అభివృద్ధి చేసిన మైత్రి క్రీడా ప్రాంగణాన్ని, రూ.3 కోట్ల 40 లక్షలతో  స్పోర్ట్స్ కాంప్లెక్స్​ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం  పటాన్ చెరు ఏరియా ఆస్పత్రిలో కరూ.1.10 కోట్లతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ఓపెన్​ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పటాన్​చెరు పట్టణంలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏడున్నర కోట్ల తో స్టేడియం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే ప్రభుత్వం గ్రామాల్లోని క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్  ఇవ్వబోతోందని తెలిపారు. అలాగే పటాన్​చెరు పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రూ.300కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రొటైం చైర్మన్​ భూపాల్​రెడ్డి, జడ్పీచైర్​ పర్సన్​ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

 

 

ఇవి కూడా చదవండి

గజ్వేల్‌‌లో స్పౌజ్ టీచర్ల ఆవేదన సభ

ప్రతి నెల ఒక రోజు పీహెచ్‌‌సీలోనే నిద్రించాలి