ఎంఎస్‎ఎంఈలకు తోడ్పాటు అందిస్తున్నం: యాక్సిస్ బ్యాంక్ ప్రకటన

ఎంఎస్‎ఎంఈలకు తోడ్పాటు అందిస్తున్నం: యాక్సిస్ బ్యాంక్ ప్రకటన

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణలోని మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీస్‎కు (ఎంఎస్​ఎంఈ) వీలైనంత తోడ్పాటును అందిస్తున్నామని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. సంస్థ  సీనియర్​ఎగ్జిక్యూటివ్స్​ విజయ్ శెట్టి, ప్రశాంత్ హైదరాబాద్‎లో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 వేలకు పైగా ఎంఎస్​ఎంఈ ఖాతాలకు సేవలు అందిస్తున్నామని, 199 శాఖల ద్వారా కస్టమర్లకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

2026 మార్చి నాటికి ఎంఎస్​ఎంఈ లోన్​బుక్​ విలువ రూ. 2.93 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు. ‘‘చిన్న వ్యాపారాల కోసం డిజిటల్ రుణాలు, ఇన్‌‌‌‌వాయిస్ డిస్కౌంటింగ్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నాం.  ఎంస్​ఎంఈ విభాగంలో మాకు 8.1 శాతం మార్కెట్ వాటా ఉంది. ఎస్​బీబీసీ, ఎస్​ఎంఈ, మిడ్-కార్పొరేట్ లోన్లు  రెండంకెల వృద్ధి సాధించాయి”అని అన్నారు.