నేచురల్‌గా దొరికే కుంకుడు కాయలతో.. డిష్ వాష్ లిక్విడ్, లాండ్రీ డిటర్జెంట్ తయారు చేసుకోవచ్చు. అదెలాగంటే..
డిష్‌వాష్ లిక్విడ్: ఆరు కప్పుల వేడి నీళ్లలో 15 నుంచి 20 కుంకుడు కాయలు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని 40 నిమిషాలు సన్నటి మంట మీద మరిగిం చాలి. తర్వాత చల్లార్చి, కుంకుడుగింజల్ని తీసేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, నీళ్లని వడగట్టి బాటిల్లో పోయాలి. దీన్ని 6 రోజుల వరకు వాడుకోవచ్చు. దీంతో గిన్నెలు, అద్దాలు, టైల్స్, జువెలరీ.. ఇలా అన్నీ క్లీన్ చేయొచ్చు. ఒకసారి వాడిన కుంకుడు కాయల్ని 4 సార్లు వాడుకోవచ్చు.
లాండ్రీ డిటర్జెంట్: పాత సాక్స్లని శుభ్రంగా ఉతికి, ఆరబెట్టాలి. అందులో 10 కుంకుడు కాయలు వేసి, చివర్లు ముడి వేయాలి. కప్పు నీళ్లని బాగా మరిగించి, అందులో ఓ పావుగంట ఆ సాక్సుని ఉంచాలి. తర్వాత చల్లార్చి, వాషింగ్ మెషిన్లో బట్టలతో పాటు ఆ సాక్సుని వేస్తే డిటర్జెంట్‌తో పనిలేకుండా బట్టల మురికి వదులుతుంది.
