శేశు వర్ధన్ ని కిడ్నాప్ చేసిన వాళ్లని పట్టుకున్నాం : ఏసీపీ రమణ గౌడ్

శేశు వర్ధన్ ని కిడ్నాప్ చేసిన వాళ్లని పట్టుకున్నాం : ఏసీపీ రమణ గౌడ్

రంగారెడ్డి జిల్లా నార్సింగి రాయట్లీ దగ్గర వ్యాపారి శేశు వర్ధన్ రెడ్డిని కడ్నాప్ చేసిన దుండగులను అరెస్ట్ చేశామన్నారు ఏసీపీ రమణ గౌడ్. నిన్న రాత్రి మారుతి కారులో శేశు వర్ధన్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు డయాల్ 100కు ఫోన్ వచ్చిందన్నారు. కంట్రోల్ రూమ్స్, ఇంటర్ స్టేట్, బార్డర్స్ చెక్ పోస్ట్ లను అలెర్ట్ చేశామన్నారు.

 శేశు వర్ధన్ రెడ్డికి.. క్రాంతి, సందీప్ మధ్య రెండున్నర కోట్ల ఆర్ధిక లావాదేవీల గొడవలు ఉన్నాయని తెలిపారు. కర్నూల్ వైపు వెళ్తున్న కార్ ను అడ్డాకుల టోల్ గేట్ దగ్గర ట్రేస్ చేసి నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు ఏసీపీ రమణ గౌడ్.