మా దేశంలో మీ సైన్యం అక్కర్లేదు.. భారత్​కు మాల్దీవ్స్ విజ్ఞప్తి

మా దేశంలో మీ సైన్యం అక్కర్లేదు..  భారత్​కు మాల్దీవ్స్ విజ్ఞప్తి

మాలె: తమ దేశంలోని భారత బలగాలను మార్చి 15లోపు వెనక్కి తీసుకోవాలని మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ మొయిజ్జు విజ్ఞప్తి చేశారు. చైనా అనుకూల లీడర్ అయిన మొయిజ్జు గత నవంబర్ లో ప్రెసిడెంట్ అయిన వెంటనే మాల్దీవుల్లోని భారత బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు. తాజాగా ఆదివారం ఉదయం జరిగిన మీటింగ్ లో అధికారికంగా మార్చి 15 వరకు బలగాలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని స్థానిక మీడియా వెల్లడించింది.

ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది ఇండియన్ మిలిటరీ సిబ్బంది ఉన్నారని తెలిపింది. మాల్దీవుల ప్రెసిడెంట్ ఆఫీస్ సెక్రటరీ అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం కూడా ఆదివారం మాలెలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని కన్ఫమ్ చేశారు. ‘‘ఇండియన్ మిలిటరీ సిబ్బంది మాల్దీవుల్లో ఉండొద్దు. ఇది ప్రెసిడెంట్ మొహ్మద్ మొయిజ్జు ప్రభుత్వం నిర్ణయించిన పాలసీ” అని ఆయన అన్నారు. బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల  కోర్ గ్రూప్ ఆదివారం ఉదయం మాల్దీవుల విదేశాంగశాఖ ఆఫీసులో తొలిసారి భేటీ అయిందని, మీటింగ్​కు ఇండియన్ హైకమిషనర్ మును మహవర్ కూడా హాజరయ్యారని మీడియా పేర్కొంది. ఈ మీటింగ్​లోనే మార్చి 15ను డెడ్ లైన్​గా నిర్ణయించినట్లు నజీమ్ వెల్లడించారు. అయితే, దీనిపై భారత ప్రభుత్వం