తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ గ్రేట్ అని అన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అసెంబ్లీ సెషన్ ఉన్నప్పటికీ నా మిత్రుడు సీఎం రేవంత్ ఆహ్వానం మేరకు.. హాజరై సప్పోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సోమవారం (డిసెంబర్ 08) ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న డీకే.. ఇది తెలంగాణకే కాదు.. సౌత్ ఇండియాకు గొప్ప మార్గదర్శకం అని కొనియాడారు.
తెలంగాణ ఆలోచిస్తున్నది గ్లోబల్ విజన్ అని.. వచ్చే జనరేషన్ కు ఇది అతి పెద్ద విజన్ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ఇది సాధ్యమని కొనియాడారు. ఇండియా టెక్నాలజీ గురించి మాట్లాడాలంటే బెంగళూరు, హైదరాబాద్ కీలకమని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు కాంపిటీటర్స్ అంటుంటారని.. కానీ తాము కాంపిటీటర్స్ కాదు.. ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటాం.. ప్రపంచంతోనే మాకు పోటీ.. అన్నారు.
తెలంగాణ నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ సౌత్ ఇండియాకే గర్వకారణం అని.. దేశానికే గర్వకారణం అని కొనియాడారు డీకే శివకుమార్. సౌత్ ఇండియా నేషనల్ జీడీపీకి 30 నుంచి 35 శాతం జీడీపీ కంట్రిబ్యూట్ చేస్తుందన్నారు. అందులో కర్ణాటక, తెలంగాణ కీలక పాత్ర వహిస్తున్నాయని చెప్పారు. హెల్త్ కేర్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్ లో తెలంగాణ, కర్ణాటక కీలక స్థానంలో ఉన్నాయన్నారు.
తెలంగాణ రైజింగ్ 2047 లో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని.. అందరూ కలిసి పనిచేయడమే సక్సెస్ అని అన్నారు. తెలంగాణ నేతలు అది చేసి చూపించారని కొనియాడారు. దేశానికి ఏం కావాలో, ప్రపంచానికి ఏం కావాలో.. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఈ సమ్మిట్ ద్వారా చాటి చెబుతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ను గవర్నర్ ప్రారంభించారు. 2025 డిసెంబర్ 08 నుంచి రెండు రోజుల పాటు ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ మెగా ఆర్థిక సదస్సును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సమ్మిట్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, దేశ విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
2047 నాటికి రాష్ట్రాన్ని గ్లోబల్ పవర్ హౌస్‌గా మార్చాలన్న విజన్‌తో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. అత్యంత ఆధునిక హంగులతో కూడిన వేదికలు, డిజిటల్ టన్నెళ్లు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అలంకరణలు అతిథులకు స్వాగతం పలుకుతున్నాయి.. రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను సాధించడమే ప్రధాన అజెండాగా ఈ సమిట్ నిర్వహిస్తున్నారు. దాదాపు మూడు వేల మంది దేశ, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.
