నూతన సచివాలయ ప్రారంభోత్సవంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. 9 ఏళ్ల తరువాత రాజ భవనం లాంటి సెక్రటేరియెట్ కట్టుకుని ఇవాళ పలు దస్త్రాలపై సంతకాలు చేసిన ముఖ్యమంత్రి ఇకనైనా నిత్యం సచివాలయానికి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. మోత్కూర్ పరిధి కొండగడపలో ఆయన పర్యటించి అనంతరం మాట్లాడారు. సచివాలయ నిర్మాణానికి రూ.వెయి కోట్లు ఖర్చవుతాయని చెప్పి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు.
హామీలు మరిచిన కేసీఆర్..
భారాస ఎన్నికల హామీలయిన డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని విమర్శించారు. సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టిన సీఎం కేసీఆర్ ఆయన ఆశయాలను కొనసాగించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇకనైనా సెక్రటేరియట్కి వచ్చి పరిపాలన సాగించాలని డిమాండ్ చేశారు.