Nayanthara vs Trisha : నయన్ వర్సెస్ త్రిష: సీనియర్ భామల మధ్య ‘సైలెంట్ వార్’.. 40 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు!

Nayanthara vs Trisha : నయన్ వర్సెస్ త్రిష: సీనియర్ భామల మధ్య ‘సైలెంట్ వార్’.. 40 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు!

దక్షిణాది సినీ ప్రపంచంలో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నయనతార సినిమాల స్పీడ్ పెంచింది. రెండేళ్లుగా రెండు సినిమాలకే పరిమితమైన ఈ అమ్మడు 2026లో ఏకంగా తొమ్మిది సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. వీటిలో తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. మునుపెన్నడు ఆమె ఇన్ని సినిమాలు లైన్ లో పెట్టింది లేదు. ఆచితూచి అడుగులు వేస్తూ.. బాక్సాఫీస్ పై దండయాత్రకు సిద్ధమయ్యారు.

త్రిష వేగానికి చెక్ పెడుతుందా..?

నయనతార ఇంత స్పీడు పెంచడానికి మరో సీనియర్ స్టార్ త్రిష వేగానికి చెక్ పెట్టేందుకే అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల త్రిష 'పొన్నియిన్ సెల్వన్'  సినిమా తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. గతంలో నయన్ వదులుకున్న కొన్ని సినిమాల్లో త్రిష నటించింది. వాటితో మంచి సక్సెస్ అందుకుంది. కొంతకాలంగా త్రిష అంత బిజీ గా లేనప్పటికీ సీనియర్ స్టార్స్ తో అవకాశాలు వస్తే మాత్రం కాదనుకుందా పనిచేస్తోంది. పాత్ర పరిదితో సంబంధం లేకుండా స్టార్ హీరోల పక్కన అవకాశాలు అందిపుచ్చుకోవడం నయన్ కు సవాలుగా మారింది. 

 ప్రస్తుతం త్రిష మూడు పెద్ద ప్రాజెక్టులతో దూసుకుపోతుంది.  తమిళ హీరో సూర్య సరసన 'కురుప్పు', తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర', మలయాళంలో  మోహన్ లాల్  చిత్రం'రామ్' లో నటిస్తుంది. ఈ మూడు పెద్దప్రా జెక్టులు సక్సెస్ సాధిస్తే.. నయ నతారపై ఇంపాక్ట్ పడనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

 

సెలక్టివ్ గా పాత్రల ఎంపిక..

 ఈ దశలోనే నయనతార సెలక్టివ్ గా తన పాత్రకు ప్రా ధాన్యత ఇచ్చింది. సౌత్ లో ఏ భాషలో అవకాశం వచ్చినా నో చెప్పకుండా పని చేస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా , నటనకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ సినిమాలను కూడా ఎంచుకుంటోంది.  యష్ సరసన నటిస్తున్న కన్నడ-ఇంగ్లీష్ బైలింగువల్ చిత్రంటాక్సిక్ (Toxic)  మార్చి 19, 2026న విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతి కానుకగా వస్తున్న మౌన శంకర వర ప్రసాద్ గారు  సినిమాలో నయన్ నటిస్తున్నారు. మూకుత్తి అమ్మన్ 2తన సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్‌గా ఇది రాబోతోంది.

►ALSO READ | Balakrishna: విజయ్ ‘జన నాయకుడు’ రీమేక్ ఎఫెక్ట్.. రెండేళ్ల తర్వాత టాప్ 1లోకి బాలయ్య ‘భగవంత్ కేసరి’.!

ఒకప్పుడు పోటీ పక్కన పెట్టి తమ పంథాలో తాము వెళ్లిన ఈ ఇద్దరు భామలు, ఇప్పుడు 40 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా అవకాశాలు దక్కించుకోవడం విశేషం. 2026లో నయనతార నటించే ఈ తొమ్మిది సినిమాలు గనుక సక్సెస్ అయితే, దక్షిణాదిలో ఆమె హవాకు ఇప్పట్లో బ్రేకులు పడనట్టే!