T20 World Cup 2026: వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ప్రయోగం.. వికెట్ కీపర్‌గా మ్యాక్స్‌వెల్.. బౌలింగ్ చేయాలనుకుంటే ఎలా..?

T20 World Cup 2026: వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ప్రయోగం.. వికెట్ కీపర్‌గా మ్యాక్స్‌వెల్.. బౌలింగ్ చేయాలనుకుంటే ఎలా..?

భారత్ వేదికగా జరగనున్న 2026 టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఊహించని ప్రయోగంతో ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంది. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది స్క్వాడ్ లో ఆసీస్ వికెట్ కీపర్ గా ఒకరినే ఎంపిక చేసింది. జోష్ ఇంగ్లిస్ వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే రిజర్వ్ వికెట్ కీపర్ గా ఎవరినీ ఎంపిక చేయకపోవడం షాకింగ్ కు గురి చేస్తోంది. ఒకవేళ ఇంగ్లిస్ మ్యాచ్ మధ్యలో గాయపడితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది. ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియా చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ రిజర్వ్ వికెట్ కీపర్ గా మ్యాక్స్ వెల్ పేరును సూచించాడు.  

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టుకు ముందు శనివారం (జనవరి 3) సిడ్నీలో వికెట్ కీపర్ గురించి ప్రశ్నించినప్పుడు బెయిలీ ఇలా అన్నాడు. " ఇంగ్లిస్ ఆడలేని సమయంలో వరల్డ్ కప్ లో మ్యాక్స్ వెల్ వికెట్ కీపింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మ్యాక్సీ వికెట్ కీపింగ్ చేయగలడు. చిన్నతనంలో అతను వికెట్ కీపింగ్ చేయడం నేను చూసాను. బ్యాకప్ వికెట్ కీపర్ కోసం ఒక ప్లేయర్ ను అనవసరంగా మేము సెలక్ట్ చేయలేము". అని బెయిలీ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసినప్పటి నుంచి మ్యాక్స్ వెల్ ఇప్పటివరకు వికెట్ కీపింగ్ బాధ్యతలుచేయలేదు.

►ALSO READ | Shreyas Iyer: రీ ఎంట్రీలోనే సారధ్య బాధ్యతలు: కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. సూర్య, దూబేలతో జట్టు పటిష్టం

చివరిసారిగా మ్యాక్సీ.. జూనియర్ క్రికెట్‌లో వికెట్ కీపింగ్ చేశాడు.  2009 హాంకాంగ్ సిక్సెస్‌లో ఆస్ట్రేలియన్ సిక్స్-ఎ-సైడ్ జట్టు తరపున కీపర్ గా ఆడాడు. ఒకవేళ ఇంగ్లిస్ ఆడకపోతే మ్యాక్ వెల్ వికెట్ కీపింగ్ చేయడం ఖాయమని చీఫ్ సెలక్టర్ స్పష్టం చేశాడు. అయితే మ్యాక్సీ బౌలింగ్ చేయాలనుకుంటే మాత్రం కుదరదు. వికెట్ కీపర్ బౌలింగ్ చేయొచ్చు. కానీ మ్యాక్స్ వెల్ బౌలింగ్ చేయాలనుకుంటే ఆసీస్ కు వికెట్ కీపర్స్ ఎవరూ ఉండరు. అలెక్స్ కారీ, జోష్ ఫిలిప్ రూపంలో ఆస్ట్రేలియాకు వికెట్ కీపింగ్ ఆప్షన్స్ వీరు టీ20 క్రికెట్ లో వేగంగా ఆడలేరు. వికెట్ కీపర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ ఫామ్ లో లేకపోవడంతో ఈ యువ ఆటగాడిని వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదు. 

2026 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా జట్టు: 

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా