Shreyas Iyer: రీ ఎంట్రీలోనే సారధ్య బాధ్యతలు: కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. సూర్య, దూబేలతో జట్టు పటిష్టం

Shreyas Iyer: రీ ఎంట్రీలోనే సారధ్య బాధ్యతలు: కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్.. సూర్య, దూబేలతో జట్టు పటిష్టం

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని గ్రౌండ్ లో అడుగుపెట్టనున్నారు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన అయ్యర్.. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారీ ట్రోఫీలో ముంబై కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. కివీస్ తో సిరీస్ కు ముందు అయ్యర్ దేశవాళీ క్రికెట్ లో రెండు మ్యాచ్ లాడి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. మూడు నెలల తర్వాత బ్యాట్ పట్టిన శ్రేయాస్.. రీ ఎంట్రీలోని తమ జట్టుకు లీడ్ చేయనున్నాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో శ్రేయాస్ కెప్టెన్సీ చేయనున్నాడు.  

విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు గాయం కారణంగా తప్పుకున్న శార్దూల్ ఠాకూర్ స్థానంలో శ్రేయాస్ జట్టులోకి వస్తాడని ముంబై క్రికెట్ అసోసియేషన్ సోమవారం (జనవరి 5) ధృవీకరించింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం (జనవరి 6) జైపూర్‌ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో ఆడబోయే మ్యాచ్‌తో ఈ ముంబై స్టార్ క్రికెటర్ పోటీ క్రికెట్‌లోకి తిరిగి రానున్నాడు. ముంబై స్క్వాడ్ లో సూర్యకుమార్ యాదవ్, శివం దూబే కూడా ఉండడంతో జట్టు మరింత పటిష్టంగా మారింది. గురువారం (జనవరి 8) పంజాబ్‌తో ముంబై తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో కూడా అయ్యర్ ఆడే అవకాశం ఉంది. 

►ALSO READ | David Miller: బాబర్, కోహ్లీ‌లలో ఎవరిది బెస్ట్ కవర్ డ్రైవ్.. మిల్లర్ సమాధానమిదే!

టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ కొనసాగుతున్నాడు. గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ కు అయ్యర్ గాయం కారణంగా దూరమయ్యాడు. గాయంతో ఇబ్బందిపడుతున్న శ్రేయాస్ డిసెంబర్ చివర్లో పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. స్టులకు కొన్ని నెలల పాటు దూరంగా ఉంటానని చెప్పిన ఈ టీమిండియా వన్డే వైస్ కెప్టెన్.. టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. దీంతో వన్డే క్రికెట్ లో మాత్రమే కనిపిస్తున్నాడు. మూడు నెలల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న అయ్యర్ దేశవాళీ క్రికెట్ లో ఎలా రాణిస్తాడో ఆసక్తికరంగా మారింది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతూ అయ్యర్ గాయపడ్డాడు. క్యాచ్ ఆదుకునే క్రమంలో అయ్యర్ డైవ్ చేయడంతో అతని పక్కటెముకలకు గాయమైంది.