David Miller: బాబర్, కోహ్లీ‌లలో ఎవరిది బెస్ట్ కవర్ డ్రైవ్.. మిల్లర్ సమాధానమిదే!

David Miller: బాబర్, కోహ్లీ‌లలో ఎవరిది బెస్ట్ కవర్ డ్రైవ్.. మిల్లర్ సమాధానమిదే!

క్రికెట్ లో చూడముచ్చటగా ఉండే షాట్ ఏదైనా ఉందంటే అది కవర్ డ్రైవ్. ఎన్ని ఇన్నోవేటివ్ షాట్స్ వచ్చినప్పటికీ  కవర్ డ్రైవ్ స్థానం ప్రత్యేకం. క్రికెట్ ప్రారంభం నుంచి కవర్ డ్రైవ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది క్రికెటర్లు తమ కవర్ డ్రైవ్ తో అభిమానులని కన్నుల విందు చేస్తారు. ప్రస్తుత జనరేషన్ లో కవర్ డ్రైవ్ లో బెస్ట్ ఎవరంటే టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ టాప్ బ్యాటర్ బాబర్ అజామ్ ఈ లిస్ట్ లో ఉంటారు. ఈ షాట్ ఆడడంలో వీరిద్దరు వారికి వారే సాటి. ప్రస్తుత క్రికెట్ లో కవర్ డ్రైవ్ విషయానికి వస్తే కొంతమంది కోహ్లీని బెస్ట్ అంటే మరికొందరు బాబర్ అని చెబుతారు. 

కోహ్లీ, బాబర్ లో ఎవరు బెస్ట్ కవర్ డ్రైవ్ ప్లేయర్ అనే విషయాన్ని సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ మిల్లర్ చెప్పుకొచ్చాడు. ఒక పోడ్ కాస్ట్ లో మిల్లర్ కు వరల్డ్ క్రికెట్ లో కోహ్లీ, బాబర్ లలో ఎవరు బెస్ట్ కవర్ డ్రైవ్ ప్లేయర్ అని ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు మిల్లర్ తన  సమాధానం చెప్పాడు. కోహ్లీ కంటే బాబర్ అజామ్ కవర్ డ్రైవ్ బాగుంటుందని చెప్పుకొచ్చాడు. మిల్లర్ సమాధానానికి పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమ క్రికెటర్ బాబర్.. కోహ్లీ కంటే మంచిగా కవర్ డ్రైవ్ చేయగలడని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మిల్లర్ సౌతాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో పార్ల్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. 

Also Read : సచిన్‌కు చేరువలో రూట్.. ఆల్ టైం రికార్డ్ బ్రేక్‌కు ఎన్ని పరుగులు చేయాలంటే..?

ఇటీవలే జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ కు రాజస్థాన్ రాయల్స్ మిల్లర్ ను సొంతం చేసుకుంది. కోహ్లీ విషయానికి వస్తే విజయ్ హజారీ ట్రోఫీ మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కు కోహ్లీ ఎంపికయ్యాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న కోహ్లీ బ్యాటింగ్ చూడడానికి తొలి వన్డే కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరోవైపు బాబర్ అజాం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. తొలిసారి ఈ లీగ్ ఆడుతున్న బాబర్.. ఆశించిన స్థాయిలో రాణించడంతో విఫలమవుతున్నాడు.