దేశానికే రోల్ మోడల్ గా వీ-హబ్

దేశానికే రోల్ మోడల్ గా వీ-హబ్

వీ-హబ్ దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు మంత్రి కేటీఆర్. గచ్చిబౌలిలో వీ-హబ్ గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి.. 47మందికి పట్టాలు అందించారు. సరికొత్త ఆలోచనలతో రాణించాలనుకునే యంగ్ ఆంట్ర ప్రెన్యూర్స్ కి వీ-హబ్ సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు కేటీఆర్. రాష్ట్రంలోని విద్యార్థుల్లో ఉన్న ప్రతిభని వెలికితీసేందుకు... ఐదు కాలేజీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. బయో మెడికల్, డ్రోన్ క్రియేషన్ లాంటి ప్రాజెక్ట్ లలో వర్క్ చేస్తున్న యంగ్ ఆంట్ర ప్రెన్యూర్స్ ని అభినందించారు కేటీఆర్.