ఆదివాసీలపై తెలంగాణ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది

ఆదివాసీలపై  తెలంగాణ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించింది

తెలంగాణలో ఆదివాసీలకు అండగా ఉంటామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీనిచ్చారు. ఆదివాసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. వారి గొంతును అణిచివేసేందుకు పోలీసుల బలగాలను ఉపయోగించడం రాష్ట్ర ఆకాంక్షలకు అవమానమని అభివర్ణించారు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ మహిళలపై ఫారెస్టు అధికారుల దాడికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ పై రాహుల్ గాంధీ ఫేస్ బుక్ లో స్పందించారు. పట్టాలను అర్హులైన ఆదివాసీలకు బదలాయిస్తామని ప్రభుత్వం హామీనిచ్చిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనంతరం కేసీఆర్ సర్కార్ వెనక్కి తగ్గి రాష్ట్ర ప్రజలకు దోహం చేసిందని విమర్శించారు. కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్రం ఏర్పడిందన్నారు. జల్ జంగల్ జమీన్ పోరాటంలో ఆదివాసీలకు అండగా ఉంటామని సోషల్ మీడియాలో తెలిపారు. 

 

The brutal crack down of state force on Adivasis in Telangana, especially women, who are struggling to protect their land rights is deplorable. Telangana was formed to fulfill the collective aspirations of crores of people in the state- protection of Adivasi rights being a quintessential part of it. Misusing police force today to crack down on the Adivasi voice is an affront to this dream. The KCR govt has betrayed our people by first announcing to transfer Podu land title deeds to deserving Adivasis, and then backtracking soon after. In their fight to protect 'Jal-Jungle-Zameen', we stand with our Adivasi sisters and brothers.

Posted by Rahul Gandhi on Saturday, July 9, 2022

మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో గుడిసెలు వేసుకున్నారు గిరిజనులు. ఆ గుడిసెలను తొలగించేందుకు వచ్చిన ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు గిరిజన మహిళలు. పలువురు గిరిజన మహిళలను అదుపులోకి తీసుకునే సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గిరిజన మహిళలను ఈడ్చుకెళ్లారు ఫారెస్ట్ మహిళా సిబ్బంది. మూడు వందల మంది ఫారెస్ట్ అధికారులు, పోలీసులు మోహరించి.. కోయపోషగూడెం గిరిజనులను అక్కడి నుంచి తరలించారు. పోలీసులు వ్యవహరించిన తీరును నేతలు తప్పుబడుతున్నారు.