
హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నాని తెలిపారు మంత్రి హరీష్ రావు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు అన్నారు. దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్న ఆయన.. తమ లోపాలను సవరించుకుంటామన్నారు. దుబ్బాక ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉంటామన్నారు.
ఓడిపోయిప్పటికి దుబ్బాక ప్రజలకు టీఆర్‌ఎస్ పక్షాన, నా పక్షాన కష్ట సుఖాల్లో తోడుగా ఉంటామన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకు, కార్యకర్తలకు, అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తూ టీఆర్‌ఎస్ ఎప్పుడు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు మంత్రి హరీష్.