
హైదరాబాద్: 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం (ఆగస్ట్ 24) హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో ఏపీఏసీ బయోడిజైన్ సమ్మిట్ కార్యక్రమం జరిగింది. వైద్య పరికరాల తయారీలో స్వయం ప్రతిపత్తే లక్ష్యంగా జరిగిన ఈ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఇన్నోవేటింగ్ ఫర్ భారత్ ది బయోడిజైన్ బ్లూప్రింట్ ఆవిష్కరించారు.
అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగిందన్నారు. సుల్తాన్ పూర్ లో దేశంలోనే పెద్ద మెడికల్ డివైజ్ పార్క్ ఏర్పాటు చేశామని, ఇప్పటికే 60పైగా కంపెనీలు అక్కడ ఉన్నాయని తెలిపారు. మెడికల్ డేటాను పరిశోధన కోసం కంపెనీలకు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఇన్నోవేటర్స్, స్టార్ట్‌ప్‌ల ఏర్పాటుకు ఇదే సరైన సమయమని అన్నారు. మానవాళిని ఆరోగ్యంగా మార్చడానికి ప్రయత్నం చేద్దామని పిలుపునిచ్చారు.
►ALSO READ | రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవాలి.. సోషల్ జస్టిస్ కోసం అందరూ ముందుకు రావాలి: మంత్రి వివేక్