రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవస్థను పూర్తిగా అరికడతం : డీజీపీ

రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవస్థను పూర్తిగా అరికడతం : డీజీపీ

రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యవస్థను పూర్తిగా అరికడతామని డీజీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఎన్‌డీపీఎస్‌ చట్టం, దర్యాప్తు ప్రక్రియపై అధికారులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణను ఆయన ప్రారంభించారు. నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్స్ చట్టం అమలులో  రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గొలుసుకట్టు విధానంగా జరిగే మాదక ద్రవ్యాల పంపిణీని అరికట్టడానికి ఆధునిక, శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేయాలని సూచించారు.

గతేడాది రాష్ట్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న 1278 మందిపై కేసులు నమోదు చేయగా వీరిలో 218 మందిపై పీడీ యాక్ట్ కేసులు పెట్టామమని డీజీపీ చెప్పారు.  2021లో 152 మంది, 2020లో 46 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు. మొత్తం 89,718 కిలోల గంజాయి, 711 కిలోల ఇతర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎన్డీపీఎస్ చట్టంలో నిర్దేశించినట్లుగా డ్రగ్స్ అక్రమ రవాణాను శోధించడంతోపాటు స్వాధీనం చేసుకోవడం సక్రమంగా జరగాలన్నారు.