నిరసన దీక్షకు దిగిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు

 నిరసన దీక్షకు దిగిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు

ప్రభుత్వం గణేష్ నిమజ్జన ఏర్పాట్లు చేసేవరకు తమ నిరసన కొనసాగుతుందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు తెలిపారు. గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. అంతకుముందు ఉత్సవ సమితి చేపట్టిన బైక్ ర్యాలీని అడ్డుకుని భగవంతరావు సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ నుంచి విడుదలైన తర్వాత వారు ఉత్సవ సమితి కార్యాలయంలో నిరసన దీక్షకు దిగారు. 

హుస్సేన్ సాగర్ లోనే  గణేష్ విగ్రహల నిమజ్జనం కోసం అనుమతివ్వాలని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ గణేష్ విగ్రహల నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించేందుకుగానూ బైక్ ర్యాలీకి పిలుపునివ్వగా.. పోలీసులు అడ్డుకున్నారు. గత ఏడాది హుస్సేన్ సాగర్ లో ఎలా  ఏర్పాట్లు చేశారో ఈ ఏడాది కూడా అదేవిధంగా ఏర్పాట్లు చేయాలని భగవంతరావు డిమాండ్ చేశారు. ఈ నెల 9వ తేదీన హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహల నిమజ్జనం  చేస్తామని భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి ఇప్పటికే ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని..లేకపోతే పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది.