న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకైన మాట వాస్తవమేనని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు. పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ పూర్తిగా విఫలమైందని, ఈ బాధ్యతను తాను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తో ఆడుకున్న విద్యా మాఫియాను నిర్మూలిస్తామని, బాధ్యులెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
మరోవైపు నీట్ వివాదంపై తన రాజీనామాను డిమాండ్ చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై మంత్రి మండిపడ్డారు. ఆయన తరచూ దేశాన్ని, ఇక్కడి వ్యవస్థలను కించపరిచేలా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారంటూ ధ్వజమెత్తారు.
