
మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం పట్ల ఎన్సీపీ రెబల్ లీడర్ అజిత్ పవార్ స్పందించారు. దేశాభివృద్ధి కోసమే ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని పవార్ చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రావడం, రాష్ట్రంలో అభివృద్ధి జరగడం పట్ల ప్రజల సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎన్సీపీ పేరు, గుర్తుపై పోటీ చేస్తామని పవార్ తెలిపారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించాడు. అందుకు ప్రతిఫలంగా మహా సీఎం ఏక్‌నాథ్ షిండే అజిత్‌పవార్‌కు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. అంతేగా పవార్ వర్గం ఎమ్మెల్యేలు తొమ్మది మందిని తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. తాజాగా జరిగిన పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి.