తేమ, తాలు తరుగు లేకుండా తెస్తే మంచి ధర ఇస్తాం

తేమ, తాలు తరుగు లేకుండా తెస్తే మంచి ధర ఇస్తాం

దేశాని అన్నం పేట్టె అన్నపూర్ణగా తెలంగాణ
ఒకే సారి 3 రేట్లు పెరగడంతో గతంలో ఇబ్బంది
రెండు నెలలు ప్రజల మధ్య ఉండాలి.
రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్

జగిత్యాల,వెలుగు: రైతుకు ప్రభుత్వం అందిస్తున్న సహయ సహకారాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికి అన్నం పేట్టె అన్నపూర్ణగా మారిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం మినిపద్మనాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వరిధాన్యం కొనుగోలు సమీక్షా సమావేశానికి పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య అతిధులుగా పాల్గోన్నారు. ఈ సందర్బముగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సకాలంలో కాళేశ్వరం జలాలు రావడం, 24 గంటల కరెంట్ వలన సాగు పెరిగిందని.. పెరిగిన వరిసాగుకు సమానంగా జిల్లా యంత్రాంగం ప్రజల మిల్లింగ్, ట్రాన్స్ పోర్టును పెంచుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

దాన్యాన్ని 17శాతం తేమతో తాలు, తరుగు లేకుండా కోనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినట్లయితే 1888 ఎంఎస్పి ఇవ్వడం జరుగుతుందని పేర్కోన్నారు. రద్దు చేసిన1153, 1156 రకలతో జిల్లాలో 150 ఎకరాలలో పంటను వేయడం జరిగిందని, ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతుకు గిట్టుబాటు ధరను ఇవ్వడంతో పాటు, మద్దతు దరను ఇచ్చేలా చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని, జిల్లాలో ట్రాన్స్ పోర్టు, మిల్లింగ్ సమస్యలు తలెత్తకుండా శాసన సభ్యులు, అధికారులు బాద్యతలు తీసుకోవాలని అన్నారు. రైస్ మిల్లుల 24గంటల మిల్లింగ్ చేస్తున్నార, బాయిల్డ్ రైస్, రా రైస్ సకాలంలో మిల్లింగ్ జరిగేలా చూడాలని మిల్లర్లను కోరారు. ఐకేపి, పాక్స్ సెంటర్ల బాకాయిలు 27 కోట్ల 24 లక్షల బకాయిలను వెంటనే మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

గన్ని బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. పంటను పండించటంలో ఎంత సహకారం అందించడం జరుగుతుందో, పండించిన పంటను అమ్మడంలో కూడారైతుకు పూర్తి సహయ సహకారాలను అందించడానికి ఎల్లవేలరైతుకు బరోసాను అందించాలని అన్నారు. కరోనా, దాన్యం సేకరణ ఒకే సారి ప్రారంభం కావడంతో కొంత ఇబ్బందులు తలెత్తాయని, అయినప్పటికి లాక్ డౌన్ కాలంలో సమర్దవంతంగా పనిచేసి దాన్య సేకరణ ఎక్కడ ఆగకుండా జరిగిందని తెలిపారు. ఎ ఒక్కరైతు కూడా ఇబ్బంది తలెత్తకుండా సమర్దవంతంగా, జవాబుదారి తనంతో పనిచేసి ఎవరికి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు.

కోనుగోలు కేంద్రాల్లో టార్పలిన్లు, దాన్యం శుద్దియంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని, మార్కేటింగ్ శాఖద్వారా కొనుగోలు చేసి పంపిణి కూడా చేయడం జరిగిందని, ప్రతి కోనుగోలు కేంద్రం వారిగా ఇంకా అవసరమైన వాటి వివరాలను పంపించాలని అన్నారు. యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఫీల్డ్ మీద ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి , జెడ్పి చైర్ పర్సన్ వసంత,ఎమ్మెల్యే లు సంజయ్ కుమార్,విద్యాసాగర్ రావు ,రవిశంకర్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,జిల్లా కలెక్టర్ రవి,అడిషనల్ కలెక్టర్ రాజేశం ఆఫీసర్లు పాల్గొన్నారు.