
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా శనివారం జరగబోయే బంద్‌లో పాల్గొనాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నిర్ణయించింది. ఈ మేరకు19వ తేదీన సమ్మెలో పాల్గొనడం కోసం డైరెక్టర్ ఆఫ్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌కు యూనియన్ నాయకులు ఒక్క రోజు సమ్మె నోటీసు ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం చేస్తున్న దాడిని, మొత్తం కార్మికవర్గంపై చేస్తున్న దాడిగా తాము భావిస్తున్నామని యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. బలరాం సోమవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. బంద్‌లో వైద్యారోగ్యశాఖలోని ఉద్యోగులంతా పాల్గొంటారని ఆయన తెలిపారు.