తెలుగు అకాడమీ ఎఫ్​డీలన్నీ వెనక్కి

తెలుగు అకాడమీ ఎఫ్​డీలన్నీ వెనక్కి
  • గోల్ మాలైన నిధులన్నీ తిరిగిచ్చేందుకు బ్యాంకులు ఓకే

హైదరాబాద్, వెలుగు: తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్​డ్ డిపాజిట్లను అన్ని బ్యాంకుల నుంచి వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఎఫ్ డీలు ఉన్న బ్యాంకులకు లెటర్ రాసింది. దీంతో పాటు ఇటీవల గోల్ మాల్ అయిన రూ.64.5కోట్లపైనా బ్యాంకర్లతో చర్చించగా, వాటిని తిరిగి ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించినట్టు ఆఫీసర్లు చెప్పారు.

తెలుగు అకాడమీ నిధుల పంపకాల సందర్భంగా పలు బ్యాంకుల్లో అకాడమీకి చెందిన 64.5 కోట్లు గోల్ మాల్ అయ్యాయని ఆఫీసర్లు గుర్తించారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో నిధులపై విచారిస్తే, పలు విషయాలు బయటపడ్డాయి. దీంతో అకాడమీ ఎఫ్​డీలకు స్వస్తి చెప్పాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం బ్యాంకుల్లోని  రూ.255.5కోట్లను విత్ డ్రా చేసుకుంటామని బ్యాంకులకు చెప్పారు.

పెద్ద మొత్తం కావడంతో బ్యాంకర్లు కొంత టైం కోరినట్టు తెలిసింది. ఆ నిధులన్నీ అకాడమీకి చెందిన జనరల్ అకౌంట్​లోనే పెట్టాలని నిర్ణయించారు. వడ్డీకి  చూస్తే, ఉన్న డబ్బులు మాయమవుతున్నాయనీ అధికారులు చెప్తున్నారు. అట్లనే అకాడమీలోని అన్ని నిధులపైనా ఎంక్వైరీ జరుగుతోంది. దీన్ని స్పీడప్ చేసేందుకు మరో ఇద్దరు ఆఫీసర్లను కేటాయించాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు.. సర్కారుకు లెటర్ కూడా రాశారు.