వికారాబాద్ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

వికారాబాద్ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటాం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

వికారాబాద్ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని బహుజన సమాజ్  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన... స్థానిక NTR చౌరస్తాలో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లాలో మొదటిసారిగా పర్యటించిన ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఆలంపల్లి నుండి ఎన్టీఆర్ చౌరస్తాకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బైంసాలో బండి సంజయ్ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. 

రాష్ట్రంలో ఆంధ్ర విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం కోసం 3వేల మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులతో 7 సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేయించుకుని, వారిని రివర్సెస్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్ తో పాటు బహుజన సమాజ్  పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు క్రాంతి కుమార్, జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.