రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. కొమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, జనగాం, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, వికారాబద్, రంగారెడ్డి సూర్యాపేట, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ ,వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలోని కొన్ని ఏరియాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
