రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన చలితీవ్రత 

 రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన చలితీవ్రత 
  • ఉదయం 8 దాటినా వీడని మంచు దుప్పటి
  • సాధారణం కంటే తక్కువ టెంపరేచర్లు..
  • పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. సాధారణంకన్నా తక్కువ టెంపరేచర్లు నమోదు అవుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో సాయంత్రం 5.30 నుంచే చలి గాలులు ప్రారంభం అవుతున్నాయి. రాత్రంతా మంచు కురుస్తోంది. 

కుమ్రుంభీం జిల్లాలో అత్యల్పంగా 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్ లో 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. తిర్యానిలో 9.3డిగ్రీలు, వాంకిడిలో 9.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండి, బేలలో 9.7డిగ్రీలు, భోరజ్, ర్యాలీలో 10 డిగ్రీలు, సిద్దిపేట ధూల్ మిట్టలో 10.3, నిర్మల్ బెంబిలో 10.8 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్ర పెరుగుతుండడంతో ఇండ్లలోనుంచి జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం పూట పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 దాటినా దట్టంగా కమ్ముకున్న మంచుదుప్పటి వీడడం లేదు. ఎదురుగా వస్తున్న వెహికిల్స్ కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.