ఈ వారం ( ఆగస్టు 23–29)చివరిలో కన్యారాశిలో చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని రాశుల వారికి అదృష్టం వరించగా.. మరికొన్ని రాశుల వారికి మిశ్రమంగా ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .
మేష రాశి: ఈ వారం ఈరాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు ఉంటాయి. కెరీర్ నిమిత్తం విదేశాలకు వెళ్లేఅవకాశం ఉంటుంది. కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారు ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇక ఆర్థిక విషయానికి వస్తే అదనపు ఖర్చులు ఉంటాయి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: ఈ వారం ఈ రాశి వారు కెరీర్ విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి.జీవన విధానంలో అనుకోకుండా మార్పులు సంభవిస్తాయి. వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోకపోతే నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు మిత్రుల మాటలు విని వ్యసనాలకు బానిసయ్యే అవకాకాశాలున్నందున చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వారం చివరిలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమ, పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి.
మిథునరాశి: ఈ రాశి వారికి ఈ వారంలో ఆదాయం పెరిగినా.. దానికంటే ఎక్కువుగా ఖర్చులు పెరుగుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శత్రువులు.. నమ్మక ద్రోహులు చెడు చేసే అవకాశం ఉన్నందున వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. పాత స్నేహితులను వదిలి కొత్తవారితో స్నేహం చేస్తారు. అనవసర పరిచయాలు ఏర్పడటంతో సమాజంలో కొన్ని అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కొన్ని అవార్డులు అందుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ప్రేమ. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. ఏదో తెలియని ఆందోళనతో ఉంటారు. నిరాశ పడకండి. మీరు తలపెట్టిన పనుల్లో మొదట ఆటంకం ఏర్పడినా చివరకు మీరే విజయం సాధిస్తారు. మీ పట్టుదలే మీ విజయానికి సోపానం. వ్యాపారస్తులు.. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చేతి వృత్తుల వారికి శ్రమ అధికం అవుతుంది. పెళ్లి.. ప్రేమ విషయాలు మధ్యస్తంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ రాకపోయినా ఉద్యోగం మాత్రం లభిస్తుంది.
కన్యారాశి: ఈ వారం కన్యారాశి వారు చేపట్టిన పనులు నిలకడగా సాగుతాయి. ఉద్యోగస్తులకు హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా బలపడతారని పండితులు సూచిస్తున్నారు. కొత్త ఆలోచనలు.. కొత్త నిర్ణయాలు కలసి వస్తాయి. ఫుల్ ఎనర్జీతో ముందుకు సాగుతారు. కెరీర్ లో ఒక లక్ష్యంతో ముందుకు సాగడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కొత్త జాబ్ ఆఫర్ కూడా పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది.
తులారాశి: ఈ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే వారం చివరిలో కొన్ని అదనపు ఖర్చులు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ వారంలో పనిభారం పెరుగుతుంది. కార్యాలయంలో గుర్తింపుతో పాటు గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టే వారికి కలసి వస్తుంది. ఈ అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి నిర్ణయం తీసుకుంటారు.ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. ఈ సమయంలో మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. నాయకత్వ లక్షణాలతో ధైర్యంగా ముందుకు సాగుతూ ఇతరుల మనసు గెలుచుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి. వారం చివరిలో కొన్ని అనుకోని ఖర్చులు ఏర్పడుతాయి. విదేశీ ప్రయాణం కోసం ఎదురుచూసే వారు శుభవార్త వింటారు.
ధనస్సు రాశి: ఈ వారం ఈ రాశి వారు అనుకున్న పనులు నెరవేరతాయి. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగి .. కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆర్ధికంగా కొద్ది మేరకు బలపడతారు. అనుకోకుండా దూరపు ప్రయాణం చేయాల్సి రావచ్చు. కెరీర్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మీ దగ్గరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. కుటుంబం,స్నేహితులు అత్యవసర సమయంలో మీకు తోడుగా నిలుస్తారు. మీరు చేసే ప్రయాణాలు లాభాలు కలిగిస్తాయి. సమాజంలో మీ హోదా, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి.వ్యాపారస్తులు మంచి లాభాలు గడిస్తారు. అధికారులు, పెద్దల ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. పూర్వీకుల ఆస్తి చేతికి రావడంతో కొన్ని అప్పులు తీరుతాయి.
మకర రాశి: ఈ రాశి వారికి ఈ వారం మంచి పరిచయాలు ఏర్పడుతాయి. పెళ్లి కోసం ఎదురు చూసే వారు శుభవార్త వింటారు. ఉద్యోగస్తుల జీవితం సంతృప్తికతరంగా సాగిపోతుంది. కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరుతుంది. పలుకుబడి పెరుగుతుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. అవసరాలకు తగిన సొమ్ము అందుతుంది. కుటుంబంలో మీపట్ల ఆదరణ పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కూడా సంతృప్తి కరంగా సాగుతాయి. గతంలో రావాల్సిన బాకీలు, బకాయిలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు లభించే అవకాశం ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారు ఈ వారం ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్యలనుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆశించిన హోదా దక్కుతుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు చేసే వారికి బంధువర్గంలోని వారితోనే అనుకోకుండా సంబంధం కుదరురుతుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలలో పురోగతి. వాహనాలు, స్థలాలు కొంటారు. ఇతరుల నుంచి రావలసిన డబ్బు అందుతుంది. ఇంటాబయటా బిజీగా గడుపుతారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టబడులు పెట్టేందుకు మంచి సమయం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి: ఈ రాశి వారు ఈ వారం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది.చేతి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థికపరమైన ఒత్తిళ్లను చాలావరకు తగ్గించుకునే అవకాశం ఉంది.. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
