
వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జులై 13 నుంచి జులై19 వ తేది వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం...
మేష రాశి: ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. కొన్ని విషయాల్లో బయట వ్యక్తులు కలుగజేసుకోవడం వలన సమస్యలు పెరుగుతాయి. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులుపెట్టేందుకు అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.
వృషభ రాశి: ఈ వారం కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారం మధ్యలో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. గతంలో రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఎలాంటి ఆందోళన అవసరం లేదు.. అంతా మంచే జరుగుతుంది.
మిథున రాశి: ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొద్దిపాటి ఇబ్బందులు వస్తాయి. మాట పట్టింపునకు పోకుండా మీ పని మీరు చేసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
కర్కాటక రాశి: ఈ వారం మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. జీవితభాగస్వామి మద్దతుతో అన్ని పనులు పూర్తి చేస్తారు.
సింహ రాశి: ఈ వారం మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది.కొన్ని ఊహించని సంఘటనలు మానసిక అశాంతిని కలిగిస్తాయి. డబ్బు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ... పెళ్లి విషయాలను తాత్కాలికంగా వాయిదా వేయండి.
కన్యా రాశి: ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ శత్రువులు మీపై విజయం సాధించే అవకాశాలున్నాయి. ప్రతి పని విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని పండితులు సూచిస్తున్నారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి.
తులా రాశి: ఈ వారం ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. ఈ వారం మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పోతుంది. అధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. ఉద్యోగంలో బాధ్యతల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. చేపట్టిన పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం కానీ చేయవద్దని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి... వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
ధనుస్సు రాశి: ఈ వారం మీరు మీ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విలాసాలకు పోవడం మంచిది కాదు. దుబారాను మానేయండి. ఆస్తిపాస్తుల కొనుగోలు, అమ్మకాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు బీ అలర్ట్. అదృష్టం వరిస్తుంది కానీ సోమరితనం కారణంగా నష్టపోయే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ప్రేమికులకు పెద్దల అంగీకారంతో వివాహ సంబందం కుదిరే అవకాశం ఉంది.
మకర రాశి: ఈ వారం ఈ రాశి వారు కెరీర్ గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.ఆర్థిక వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. వృత్తి .. ఉద్యోగాల్లో కీలక పనిభారం పెరగడంతో పాటు కీలక బాధ్యతలు పోషించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.ప్రతి విషయాన్ని ఓర్పు.. సహనంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.
కుంభ రాశి: ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందుతారు. గతంలో ఉన్న వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడి. పూర్వీకుల ఆస్తి కలసి వచ్చే అవకాశం ఉంది. బంధువుల వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.
మీన రాశి: ఈ వారం మీరు మీ జీవితంలో కొత్త మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కెరీర్ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. నిరుద్యోగులు మంచి జాబ్ కోసం కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.