
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( జులై 6 నుంచి జులై12 వ తేది వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశి వారికి అన్ని విధాలా శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉందదు.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల విషయాల్లో ఊహించని లాభాలు కలుగుతాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి... కొద్దిపాటి చికాకులు కలిగే అవకాశం ఉంది. ఆదాయంతో పాటు ఖర్చు కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమభారం పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి. పెళ్లికోసం ఎదురురుచూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
మిథున రాశి: ఈ రాశి వారు ఈ వారం ప్రతి విషయంలోనూ శ్రద్ధ తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు, . రోజువారీ కార్యకలాపాల్లో చిన్నచిన్న ఆటంకాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచి. వారం చివరిలో శుభవార్త వింటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆస్తుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు.. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనండి.. అంతా మంచే జరుగుతుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి అవార్డులు అందుకుంటారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే ఆశించిన లాభాలు కలుగుతాయి, బంధువుల నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. గతంలో ఉన్న ఆర్ధిక సమస్యలు పరిష్కారమవుతాయి. డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.
సింహ రాశి: ఈ రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరాలనుకొనే వారు శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు సామాన్య ఫలితాలుంటాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో రావలసిన మొండి బకాయిలు వసూలవుతాయి. ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వవద్దని పండితులు సూచిస్తున్నారు.
కన్యారాశి: ఈ రాశి వారికి ఈ వారం కొంత అదనపు ఖర్చులు ఉంటాయి, ఆర్థిక వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తుంది. కొత్త పనులను వాయిదా వేయడం మంచిది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. పనిభారం పెరుగుతుంది. వారం చివరిలో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారస్తులు ఎట్టి పరిస్థితిలో కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. ఓర్పు.. సహనంతో ఉండండి అంతా మంచే జరుగుతుంది.
తులారాశి: ఈ రాశి వారు ఈ వారంలో కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కెరీర్ పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిరుద్యోగులు గుడ్న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు అన్ని విధాలాఅనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. అనుకోకుండా ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ప్రేమ... పెళ్లి విషయాలు అనుకూలిస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ వారం రావలసిన డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామిని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బంధువుల తాకిడితో ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెడుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు. పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. భూ లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించడం అవసరం. కుటుంబసభ్యులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. వారాంతంలో మంచి మార్పు వస్తుంది.
ధనుస్సురాశి: ఈ రాశి వారు ఏ ప్రయత్నం చేపట్టినా విజయ వంతం అవుతుంది. డబ్బు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి.. ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఖర్చు విషయంలో జాగ్రత్తలు తీసుకోండి . ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.
మకర రాశి : ఈ రాశి వారికి ఈ వారం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆర్థిక, ఆస్తి వ్యవ హారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. ప్రమోషన్ తో పాటు కొద్దిపాటిగా వేతనం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో కొద్దిగా శ్రమపడాల్సి వస్తుంది. అనవసర ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. సహాయం పొందినవారు అవసర సమయంలో ముఖం చాటేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి
కుంభ రాశి : ఈ రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎవరితోనూ అనవసరంగా మాట్లాడవద్దు. ఆఫీసులో తోటి ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధం లేకుండానే మీరు మాట పడాల్సివస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో కూడా లాభాలు నిలకడగా ముందుకు వెడతాయి. పెండింగ్ పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. సహోద్యోగుల సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఆధ్యాత్మిక చింతనతో గడపండి... అంతా మంచే జరుగుతుంది. . .
మీనరాశి: ఈ రాశి వారికి ఈ వారం కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. . శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొద్దిపాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. తల్లితండ్రుల సహాయం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి.