
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( మే 18 నుంచి మే 24 వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. .
మేష రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఆరోగ్య పరంగా కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఆలస్యంగా ఫలితం ఉంటుంది. ఉద్యోగస్తులు అధికంగా కష్ట పడాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. వారం చివరిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి.
వృషభ రాశి: ఈ వారం ఈ రాశి వారికి ఈ మిశ్రమ ఫలితాలుంటాయి. ఏదో తెలియని ఆందోళన వేధిస్తుంది. వ్యాపారస్తులకు సామాన్యమైన లాభాలుంటాయి. కోర్టు వ్యవహారాలు కలసి వస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరగడం.. సహోద్యోగుల వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అనవసరంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. డబ్బును ఖర్చు చేసే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
మిథున రాశి: ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు కలుగుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్తగా ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కలసివస్తాయి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈ వారం కుటుంబసభ్యుల మద్దతు పుష్కలంగా ఉంటుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు కలుగుతాయి. జాబ్ హోల్డర్స్ కు అన్ని విధాలా బాగుంటుంది. వారం మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమ..పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
సింహ రాశి : ఈ రాశి వారికి ఈ వారం అన్నివిధాల అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వారం ప్రారంభంలో ఆందోళన కలిగిస్తుంది. అయినా ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. గతంలో మిమ్మలను విబేధించిన వారు మీ దగ్గరకు రావలసిన పరిస్థితులు ఏర్పడుతాయి. అయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.
కన్యారాశి : ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఉదర (పొట్ట) సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. వృత్తి.. వ్యాపారాల్లో సామాన్య లాభాలుంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిద వేసుకోండి. ఆధ్యాత్మిక చింతనతో గడపండి.. అంతా మంచే జరుగుతుంది.
తులారాశి: ఈ వారం ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ వారం కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. గతంలో ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేస్తారు. పిల్లల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలను పొందుతారు. ప్రేమ విషయంలో గొడవలు రాకుండా చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
వృశ్చికరాశి: ఈ రాశి వారు ఈ వారంలో చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలని పండితులు సూచిస్తున్నారు. చిన్న చిన్న ఆటంకాలు కలిగినా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం.. ప్రశంశలు.. అవార్డులు వస్తాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి : ఈ రాశి వారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందవచ్చు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. కొత్తగా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
మకర రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. శరీర సౌందర్యం కోసం శ్రమిస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం ప్రారంభంలో కొంత మందకొడిగా ఉన్నా ... వారం మధ్యలో నుంచి పుంజుకుంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. రోజువారి లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. పెద్దల సూచనలు, సలహాలు పాటించండి . అంతా మంచే జరుగుతుంది.. భూ లావాదేవీల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు సంయమనంతో వ్యవహరించాలని పండితులు సూచిస్తున్నారు.
కుంభరాశి : ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. సహోద్యోగులతో ఆభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించకుండా.. చేతిలో ఉన్నవాటిపై దృష్టి పెడితే మంచిదని పండితులు సూచిస్తున్నారు. ప్రయాణాల వల్ల లబ్ది చేకూరుతుంది. వ్యాపారస్తుల విషయంలో అంతా మంచే జరుగుతుంది. సమాజంలో గౌరవం.. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడడే మంచిది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి.
మీన రాశి : ఈ రాశి వారికి ఈ వారం కొన్ని ముఖ్యమైన సమస్యలు, వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. . వృత్తి, ఉద్యోగాల పరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాలు పెరిగే అవకాశముంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉంటుంది.