వారఫలాలు: మే 25 నుంచి 31 వ తేదీ వరకు

వారఫలాలు: మే 25 నుంచి 31 వ తేదీ వరకు

జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( మే 25  నుంచి మే 31 వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. . 

మేషరాశి: ఈ రాశి వారు  ఆత్మవిశ్వాసం.. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలతో అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు.  కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మాససికంగా వేధిస్తున్న సమస్యలకు.. గతంలో ఆగిపోయిన పనులకు పరిష్కారదొరుకుతుంది. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది. కొత్తగా వచ్చిన  అవకాశాలను వదులుకోకండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు గుడ్​ న్యూస్​ వింటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఆరోగ్య విషయంలో.. వాహనం డ్రైవింగ్​ విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

వృషభ రాశి: ఈ వారం ఈ  రాశి వారికి  చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుంది. సమాజంలో గౌరవం కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.  పెళ్లి సంబంధాలు చూసే వారికి బంధు వర్గంలో సంబంధం కుదురుతుంది.  ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 

మిథునరాశి: ఈ వారం ఈ రాశి తీసుకునే నిర్ణయంతో  అన్ని విధాలా బాగుంటుంది.  గతంలో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభిస్తారు. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు పొందుతారు.  ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. అయినా సంతృప్తిగానే ఉంటుంది. కొన్ని వార్తలు భావోద్వేగానికి గురిచేసే అవకాశం ఉంది.. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.. ఈ వారం దగ్గరి బంధువులను కలిసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారం  గతంలో ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి.  ఆత్మవిశ్వాసం పెరిగి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.  ఉద్యోగస్తులకు.. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎవరితోనూ ఎలాంటి చర్చలు పెట్టుకోద్దని...  ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.   అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దూరపు ప్రయాణాలు చేయవలసి రావచ్చు. 

సింహరాశి: ఈ రాశి వారు ఈ వారం కొత్త  పనులు ప్రారంభించే అవకాశం ఉంది.  ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనికి పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పురోగతి ఉంటుంది.  ప్రమోషన్​ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.   కొత్త వెంచర్​ లు ప్రారంభించే అవకాశం ఉంది.  ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండదు. సమయానికి ఆహారం తీసుకోండి.. అంతా మంచే జరుగుతుంది. 

కన్య రాశి: ఈ రాశి వారు ఈ వారం చాలా బిజీగా గడుపుతారు.  చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.  కొన్ని  కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం కలుగడంతో  మానసిక శాంతిని అనుభవిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అన్నివిధాలా బాగుంటుంది.  ఇక ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి విషయాలు అనుకూలిస్తాయి.  

తుల రాశి: ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో సంపద పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు.. చేతివృత్తుల వారికి అనుకోకుండా కొత్త ఆర్డర్లు వస్తాయి.  కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయాలు తొలగిపోతాయి. కొత్తవస్తువులు కొనుగోలు చేస్తారు.  ఇక ఉద్యోగస్తుల విషయంలో ప్రమోషన్​ రావడం.. వేతనం పెరగడం.. అవార్డులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

వృశ్చిక రాశి: ఈ రాశి వారు కొత్త వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. ముఖ్యమైన డాక్యుమెంట్స్​ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఇక ఉద్యోగస్తుల విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది.  ఎవరిని కించపరచి మాట్లాడకండి.. భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు ఎగుడు.. దిగుడుగా ఉంటాయి.  నష్టం మాత్రం ఉండదు.  ప్రేమ ... పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోండి.  ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అనవసర విషయాల జోలికి వెళ్లవద్దని పండితులు సూచిస్తున్నారు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈ వారం చాలా ఆనందంగా గడుపుతారు.  పాత స్నేహితులను కలుసుకుంటారు.  కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.  వ్యాపార రంగంలో ఉన్నవారు విస్తరించే అవకాశం ఉండటం.. మొండి బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు.  ఆఫీసులో తోటి ఉద్యోగస్తులతో... ఉన్నతాధికారుల అండ దండలు పుష్కలంగా ఉంటాయి.  ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి. 

మకరరాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులను సునాయాశంగా పూర్తి చేస్తారు.  మీరు తీసుకునే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది. గతంలో నిలిచిపోయిన పనులను.. కొత్త వ్యక్తులు పరిచయం కావడంతో మళ్లీ ప్రారంభిస్తారు. కొత్త టెక్నాలజీతో వ్యాపారస్తులు మంచి అభివృద్దిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  సహోద్యోగుల అండదండలు పుష్కలంగా ఉంటాయి.  విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కాని.. కాళ్లకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

కుంభరాశి: ఈ రాశి ఈ వారం  ఎక్కువుగా వినోద కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు.  పాత స్నేహితులను.. చాలాకాలంగా ఎదురుచూస్తున్న బంధువులను కలుసుకుంటారు.  కుటుంబసభ్యుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయి.ఈ వారం కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులు పురోగతి సాధించే అవకాశం ఉంది.  సమాజంలో  గౌరవం.. కీర్తి ... ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు అన్ని విధాలా బాగుంటుంది.  సమయానికి తినకపోవడం వలన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. 

మీన రాశి: ఈ రాశి వారు ఈ వారం  మానసిక ప్రశాంతతను పొందుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. మీకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేయడంతో ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు.  వ్యాపారస్తులుల కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. కోపాన్ని.. ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు.