
మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు.మిథునరాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మొండి బకాయిలువసూలవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కన్యారాశి వారు జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయంతీసుకోవాలి. వృశ్చిక రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( మే 4 నుంచి మే 10 వరకు) రాశి ఫలాలను తెలుసుకుందాం. . .
మేషరాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరంగా
కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఉద్యోగస్తులు ఎలాలంటి ఇబ్బంది ఉండదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కెరీర్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభ రాశి : ఈ రాశి వారికి ఈ వారం ( మే 4 నుంచి 10 వ తేది వరకు) సానుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. గతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు మీరే ఆఫీసులో కీలకపాత్ర పోషిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్ట్ లు ప్రారంభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఈ వారం అనుకూలమైన సమయం. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
మిథున రాశి : ఈ రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మొండి బకాయిలువసూలవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కేరీర్ పరంగా మంచి నిర్ణయం తీసుకుంటారు.గతంలో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి - : ఈ వారం ఈ రాశి వారు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. అవసరానికి మించి మాట్లాడకండి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. . ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు సామాన్య లాభాలుంటాయి. కుటుంబ సభ్యులు మీ ఆలోచనలను వ్యతిరేకించడం వలన అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలను వాయిదా వేసుకోండి. సహోద్యోగులతో అప్రమత్తంగా ఉండండి.. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను తాత్కాలికంగా వాయిదా వేయడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
సింహరాశి: ఈ రాశివారికి ఈ వారం పనిభారం పెరుగినా సంతృప్తికరంగానే జీవనం కొనసాగిస్తారు. ఉన్నతాధికారుల నుంచి అభినందనలు పొందుతారు. ఏదో తెలియని ఆందోళన చెందుతారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరితోను వాదనలు పెట్టుకోకండి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య పరంగా జలుబు..దగ్గు.. కొద్దిపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
కన్యారాశి : - ఈ వారం.. ఈ రాశి వారికి సాధారణంగానే ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా జీవిత భాగస్వామిని సంప్రదించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. వ్యాపారస్తులకు కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. ఎవరికి అప్పు ఇవ్వవద్దు. కొత్త ప్రాజెక్ట్లు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ ... పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
తుల రాశి: - ఈ వారం ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. సమాజంలో గౌరవం .. కీర్తి పెరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యవిషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. ఈ వారంలో ప్రారంభించే కొత్త ప్రాజెక్ట్ లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. జాబ్ మారాలనుకునే వారికి ఈ వారం మంచి సమయం.నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి: - ఈ వారం ఈ రాశి వారికి ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వస్తాయి. జీవితభాగస్వామి వలన ధనలాభం వచ్చే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి. అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
ధనుస్సురాశి: - ఈ వారం ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకు సొంత కంపెనీ ఉంటే అధికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కెరీర్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండదు. అనుకోకుండా ఖర్చులు రావడంతో ఆర్థికంగా ఇబ్బందిపడతారు. ప్రేమ విషయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మకరరాశి: ఈరాశి - ఈ వారం ప్రశాంతమైన జీవితం గడుపుతారు. మీ మాటలతో జనాలను ఆకర్షిస్తారు. కుటుంబసభ్యుల మద్దతుతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. కొత్త వ్యాపారం ప్లాన్ చేసే వారికి ఈ వారం అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
కుంభ రాశి: - ఈ వారం ఈ రాశి వారు తమ ప్రణాళికలు అమలు చేస్తారు. చాలా కాలంగా పెండింగ్ బకాయిలు వసూలవుతాయి. ఆహారం తీసుకొనే విషయంలో సమయాన్ని పాటించండి. వాహనం డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతుంది. కొత్త ప్రాజెక్ట్లె చేపడుతారు. వ్యాపారస్తులు ఆర్థికంగా అభివృద్ది చెందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
మీనరాశి: - ఈ వారం ఈరాశి వారికి ఒత్తిడి .. ఆందోళన పెరిగే అవకాశం ఉంది. అనుకోకుండా ఖర్చులు రావడంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొత్త పెట్టుబడుల విషయంలో వాయిదా వేసుకోండి. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారస్తులు అధికంగా కష్ట పడాల్సి ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలను వాయిదా వేయండి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.