వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం (నవంబర్ 23 నుంచి 29 వరకు ) రాశి ఫలాలను తెలుసుకుందాం..
మేష రాశి : ఈ రాశి వారికి ఈ వారం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.ఎవరితోను ఆవేశంగా మాట్లాడవద్దని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయం వృద్ది చెందుతుంది. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త బాధ్యతలు తీసుకొనే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి.
వృషభ రాశి: ఈ రాశి ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఓర్పు ... సహనంతో ఉండండి.. ఎలాంటి వాదోపవాదనలకు పెట్టుకోవద్దు. ఆఫీసులో మీ పని మీరు చేసుకోండి.. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు..దైవ చింతనతో గడపండి.. ఎలాంటి ఒడిదుడుకులకు.. ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. అంతా మంచే జరుగుతుంది.
మిథున రాశి: ఈ వారం ఈ రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. వారం మధ్యలో తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి. వృత్తి.. వ్యాపార .. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. వారం చివరిలో కొంత ఆందోళన చెందుతారు. మిగతా పనులన్నీ చాలా చక్కగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్పేమ వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కెరీర్ పరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికి అప్పు ఇవ్వవద్దు.ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనుల విషయంలో కొంత జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. డబ్బు సకాలంలో సమకూరుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పూర్వీకుల ఆస్థి లభించే అవకాశం ఉంది.ఉద్యోగస్తులకు.. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆఫీసులో మీరే కీలకపాత్ర పోషిస్తారు. ఎదుటి వారి మాటల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
సింహ రాశి: ఈ రాశి వారికి ఈ వారం కొన్ని ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రేమ విషయాలు వాయిదా వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వారం ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా... వారం మధ్యలో అన్ని సమస్యలు తీరుతాయి. వారం చివరిలో ఆర్థికంగా లాభం పొందుతారు. వ్యాపారస్తులకు ఈ వారం ... గురువారం తరువాత లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు ఉండవు. సహోద్యోగుల సహాయ సహకారాలు పుష్కలంగా ఉంటాయి.
కన్య రాశి: ఈ వారం ఈ రాశి వారికి అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ప్రతి విషయంలోను అప్రమత్తంగా ఉండండి. ఆఫీసులో ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. మీపని మీరు చేసుకోండి. మీ ప్రమేయం లేకుండా... మీకు సంబంధం లేకపోయినా.. ఒక్కోసారి అవమానాలు పడాల్సి వస్తుంది. ఓర్పు.. సహనం పాటించండి.. తరువాత వాళ్లే రియలైజ్ అవుతారు. ఇక వ్యాపారస్తుల విషయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలన జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
తులారాశి: ఈ వారం ఈ రాశి వారికి అనుకూల ఫలితాలుంటాయి. అనుకున్న పనులు అనుకున్నవిధంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడి పెట్టేందుకు అనుకూల సమయం. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు.ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు ఫలిస్తాయి.
వృశ్చిక రాశి: ఈ రాశివారికి ఈ వారం పనిభారం పెరిగినా సంతృప్తికరంగానే జీవనం కొనసాగిస్తారు. ఉన్నతాధికారుల నుంచి అభినందనలు పొందుతారు. ఏదో తెలియని ఆందోళన చెందుతారు. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఎవరితోను వాదనలు పెట్టుకోకండి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య పరంగా జలుబు..దగ్గు.. కొద్దిపాటి జ్వరం వచ్చే అవకాశం ఉంది. కెరీర్ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ఆర్థిక విషయానికొస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సి ఉంటుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అనవసర ప్రయాణాలు.. ఆందోళన కలిగిస్తాయి. వారం చివరిలో కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
మకర రాశి: ఈ వారం ఈ రాశి వారికి ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వస్తాయి. జీవితభాగస్వామి వలన ధనలాభం వచ్చే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలుంటాయి. అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వారం ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు ఉంటాయి.ఉద్యోగులు పని ఒత్తిడులతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. పూర్వీకుల ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థికపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారు ఈ వారం ఏ పని తలపెట్టినా పనులు నిదానంగా పూర్తి అవుతాయి. . కొత్త స్నేహాలు లాభదాయకంగా వుంటాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రేమ... పెళ్లి విషయాల వ్యవహారాను వాయిదా వేసుకోండి. అనవసర విషయాల్లో జోక్యం వద్దని పండితులు సూచిస్తున్నారు.
మీన రాశి: ఈ రాశి ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఓర్పు ... సహనంతో ఉండండి.. ఎలాంటి వాదోపవాదనలకు పెట్టుకోవద్దు. ఆఫీసులో మీ పని మీరు చేసుకోండి.. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు..దైవ చింతనతో గడపండి.. ఎలాంటి ఒడిదుడుకులకు.. ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
