అక్టోబర్ 5 నుంచి 11 వరకు రాశి ఫలాలు : ఈ వారం మీన రాశిలో పౌర్ణమి వస్తోంది.. ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు..

అక్టోబర్ 5 నుంచి 11 వరకు రాశి ఫలాలు : ఈ వారం మీన రాశిలో పౌర్ణమి వస్తోంది.. ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు..

ఆశ్వయుజమాసం కొనసాగుతుంది.  అక్టోబర్​ 6,7 తేదీల్లో  పౌర్ణమి ఘడియలు మీనరాశిలో  ఏర్పడుతాయి.   జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం 12 రాశులపై హార్వెస్ట్​ మూన్​ ప్రభావం ఉంటుంది.  అక్టోబర్​ 5 నుంచి 11 వరకు ఈవారం  ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. . .!

మేషరాశి :  ఈ రాశి వారికినూతన పరిచయాలు, సంఘంలో ఆదరణ, లభిస్తాయి . ఆస్తి వివాదాల పరిష్కారంతో పాటు శుభకార్యాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం ఏర్పడుతుంది.  వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి. 

వృషభరాశి: ఈ రాశి వారికి  ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ‌స్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశ‌లు అందుకుంటారు,  ఉద్యోగ‌స్తుల‌కు వేత‌నంతో పాటు ప్రమోష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంది. వ్యాపార‌స్తుల‌కు అధికంగా లాభాలు వ‌స్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి, పూర్వీకుల ఆస్థి క‌ల‌సి వ‌స్తుంది. ఆర్థిక విష‌యాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. ప్రేమ‌.. పెళ్లి వ్యవ‌హారాలు క‌ల‌సి వ‌స్తాయి.  

మిథున రాశి :   ఈ వారం ఈ రాశి వారికి అనుకూల ఫ‌లితాలుంటాయి. అనుకున్న ప‌నులు అనుకున్నవిధంగా పూర్తవుతాయి. ఆర్థిక ప‌రంగా ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.కొత్త వ‌స్తువులు కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. ఉద్యోగ‌స్తుల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. వ్యాపార‌స్తులు కొత్తగా పెట్టుబ‌డి పెట్టేందుకు అనుకూల స‌మ‌యం. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. ప్రేమ‌.. పెళ్లి వ్యవ‌హారాలు ఫలిస్తాయి. 

కర్కాటక రాశి :ఈ రాశి వారికి ఈ వారం  పౌర్ణమి ఘడియలు మీనరాశిలో ఏర్పడటం  వలన ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి.  వ్యక్తిగత జీవితంలో శుభ ఫలితాలతో పాటు.. ఆస్తి, రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.  పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. .  నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ లభిస్తుంది.  బంధువర్గంలోని వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. 

సింహ రాశి  : పౌర్ణమి  మీనరాశిలో  ఏర్పడటం వలన ఈ రాశివారికి ప్రతి ప‌నిలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి.  ప్రతి విష‌యాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక ఆర్థిక విష‌యానికొస్తే ఖ‌ర్చులు పెరిగే అవ‌కాశం ఉంది. ఉద్యోగ‌స్తులు అన‌వ‌స‌రంగా మాట ప‌డాల్సి ఉంటుంది. వ్యాపార‌స్తులు కొత్తగా పెట్టుబ‌డులు పెట్టక‌పోవ‌డ‌మే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  అన‌వ‌స‌ర ప్రయాణాలు.. ఆందోళ‌న క‌లిగిస్తాయి. వారం చివ‌రిలో కొన్ని స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. 

కన్య రాశి : ఈ రాశి వారికి ఈ వారం అంతా బాగానే ఉంటుంది.  ఆర్థిక ప‌రిస్థితి బ‌ల‌ప‌డుతుంది. ఉద్యోగ‌స్తుల‌కు  ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. వ్యాపార‌స్తుల‌కు అన్ని విధాలా బాగుంటుంది.  గ‌తంలో పెట్టిన పెట్టుబ‌డులకు ఇప్పుడు లాభాలు వ‌స్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులు శుభ‌వార్త వింటారు.  ప్రేమ‌.. పెళ్లి వ్యవ‌హారాలు క‌ల‌సివ‌స్తాయి

తులా రాశి: ఈ వారం మేషరాశి వారు  లక్ష్యసాధన దిశగా అడుగులేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ని ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  అయితే అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. . వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి.  నిరుద్యోగులకు జాబ్​ వచ్చే అవకాశం ఉంది. కొన్ని విషయాలను చూసి చూడనట్లు వదిలేయండి.  అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా..మీ పని మీరు చేసుకోండి. విమర్శలకు స్పందించవద్దని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి  ఈ వారం  మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  హార్వెస్ట్​ మూన్​ ప్రభావంతో పని భారం పెరగడంతో బిజీ బిజీగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్లో అప్రతమత్తంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లతో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఆదాయ పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.  అదనపు ఖర్చులు చేయాల్సి రావచ్చు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమ, పెళ్లి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

ధనుస్సు రాశి :  ఈ రాశి వారు ఈ వారం  వృత్తి.. వ్యాపారాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.  వ్యాపారస్తులు శ్రమపడాల్సి ఉంటుంది.  ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.  డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు.  ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అనుకున్న ఆఫర్లు వస్తాయి. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి.

మకర రాశి:  ఈ రాశి వా రు ఈ వారం  వృత్తి.. వ్యాపారాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.  వ్యాపారస్తులు శ్రమపడాల్సి ఉంటుంది.  ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి.  డబ్బు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు.  ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  స్నేహితుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అనుకున్న ఆఫర్లు వస్తాయి. ప్రేమ... పెళ్లి వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి.

కుంభ రాశి :  ఈ రాశి వారు ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. .ఆర్థికాభివృద్ధితో  కీలక నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటారు. . బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో మరిన్ని లాభాలువస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి, పూర్వీకుల ఆస్థి క‌ల‌సి వ‌స్తుంది.

మీన రాశి: ఈ రాశి వారికి ఈవారంలో మీనరాశిలో పౌర్ణమి ఘడియలు ఏర్పడటంతో   కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. . ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ‌స్తుల‌కు కెరీర్ ప‌రంగా పురోగ‌తి ఉంటుంది.  జీవిత‌భాగ‌స్వామి నిర్ణయం ప్రకారం న‌డ‌చుకోండి. ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. వ్యాపార‌స్తుల‌కు అధికంగా లాభాలు ఉంటాయి.  ఆర్థికవిష‌యాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. నిరుద్యోగులు గుడ్‌న్యూస్ వింటారు. ప్రేమ .. పెళ్లి వ్యవ‌హారాలు క‌ల‌సి వ‌స్తాయి.ఎలాంటి ఆందోళ‌న అవ‌స‌రం లేదు. అంతా మంచే జ‌రుగుతుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.