
ముషీరాబాద్, వెలుగు: గచ్చిబౌలిలోని లిడ్ క్యాప్ భూములను లీజుకు ఇచ్చేందుకు తెచ్చిన జీవో 137ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ చర్మకారుల సంఘాల జేఏసీ చైర్మన్ ఆరెపల్లి రాజేందర్ అన్నారు. మంత్రులు శ్రీధర్‌బాబు, లక్ష్మణ్కుమార్దృష్టికి తీసుకెళ్లగానే అధికారులతో మాట్లాడి జీవోను రద్దు చేయించారని తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మంత్రులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లిడ్క్యాప్పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందించారు. మాదిగ మేధావుల ఫోరం ముఖ్య సలహాదారుడు వీరస్వామి, ఉపాధ్యక్షుడు సాయిబాబా, జేఏసీ కన్వీనర్ రాజు, సెక్రటరీ జాన్ దర్శనం, ట్రెజరర్ గుమ్మడి సతీశ్, నాయకులు పాల్గొన్నారు.