
హైదరాబాద్ సిటీ, వెలుగు: కాలనీల అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర కీలకమని ఏసీపీ డి.వి. ప్రదీప్ కుమార్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన కాలనీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి హాజరై అసోసియేషన్ సర్టిఫికెట్ఆవిష్కరించారు. సంఘం చీఫ్ అడ్వైజర్‌గా డాక్టర్ పి.వి. రవిశేఖర్ రెడ్డి , ప్రెసిడెంట్‌గా జైలు శాఖ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఎం. రంగారావు, ఉపాధ్యక్షుడిగా ప్రొఫెసర్ టి. వరహాల రెడ్డి, జనరల్ సెక్రటరీగా జి.సారంగరావు ఎన్నికయ్యారు.