అసలే టీమ్ ఇండియా... ఆ పై సొంత గడ్డ...వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. టీ-20 సిరీస్ పై కన్నేసింది. దీంట్లో భాగంగా తొలి టీ-20లో విండీస్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత్. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు జట్ల మధ్య రెండో టీ-20 శుక్రవారం జరుగుతుంది. టీ-20లోనూ టీమిండియా జోరు కనిపిస్తోంది. విండీస్ తో జరిగిన ఫస్ట్ టీ-20లో గ్రాండ్ విక్టరీ కొట్టింది రోహిత్ గ్యాంగ్. వన్డే సిరీస్ లో వైట్ వాష్ కు గురైన వెస్టిండీస్ కు టీ-20 సిరీస్ తొలి మ్యాచ్ లోనూ ఓటమి రుచి చూపింది. తొలి టీ-20లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. పూరన్ 43 బాల్స్ లో 61 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. కొత్త కుర్రాడు విష్ణోయ్ తో పాటు.. హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా 18.5 ఓవర్లలో టార్గెట్ ను ఫినిష్ చేసింది. ఈడెన్ గార్డెన్స్ అంటే రెచ్చిపోయే కెప్టెన్ రోహిత్ శర్మ... మరోసారి చెలరేగాడు.
భారీ షాట్లతో విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 19 బాల్స్ లో 40 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ 35, కోహ్లీ 17 రన్స్ చేశారు. పంత్ 8 రన్స్ తో నిరాశపరిచాడు. టీమ్ విజయానికి లాస్ట్ నాలుగు ఓవర్లలో 32 పరుగులు అవసరం కావటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ 17వ ఓవర్ చివరి రెండు బంతులకు వరుసగా 4, 6 సిక్సర్ బాదిన సూర్య మ్యాచ్ ను పూర్తిగా భారత్ వైపు తిప్పాడు. వెంకటేశ్ ఓ ఫోర్ కొట్టడంతో 18వ ఓవర్లో మొత్తం 10 పరుగులు వచ్చాయి. ఆఖర్లో వెంకటేశ్ భారీ సిక్సర్ తో మ్యాచ్ ను ముగించాడు. దీంతో సూర్యకుమార్ 34 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 24 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు. విండీస్ బౌలర్లలో ఛేజ్ 2 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లను టీమిండియా బౌలర్ల కట్టడి చేశారు. తన స్వింగ్ తో తొలి ఓవర్లోనే కింగ్ ను 4 పరుగుల వ్యక్తగత స్కోర్ దగ్గర భువనేశ్వర్ పెవిలియన్ పంపించాడు. అయితే మరో ఓపెనర్ మేయర్స్ 31 రన్స్ తో చెలరేగాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి వెస్టిండీస్ ఆరు ఓవర్లలో ఒక్క వికెట్ కు 44 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్లు వెనక్కి వెల్లారు. దీంతో విండీస్ 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం జరుగుతుంది.
