గంజాయి అమ్ముతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళల అరెస్ట్.. జడ్చర్ల పోలీసుల అదుపులో నిందితులు

గంజాయి అమ్ముతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన మహిళల అరెస్ట్.. జడ్చర్ల పోలీసుల అదుపులో నిందితులు

జడ్చర్ల, వెలుగు: మహబూబ్​నగర్  జిల్లా జడ్చర్లలో గంజాయి అమ్ముతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన ఇద్దరు మహిళలను అరెస్ట్​ చేశారు. వారి వద్ద 2.71 కిలోల గంజాయి, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్  అసిస్టెంట్  సూపరింటెండెంట్ ఎల్ నరసింహారెడ్డి సోమవారం జడ్చర్ల ఎక్సైజ్​ స్టేషన్​లో మీడియాకు వివరాలు వెల్లడించారు.

జడ్చర్ల న్యూ బస్టాండ్  సమీపంలో తనిఖీలు చేపట్టగా, పశ్చిమ బెంగాల్ కు చెందిన ముని భరనో, కల్పన భారమాన్  వద్ద 2.71 కిలోల గంజాయి లభించినట్లు చెప్పారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా, పశ్చిమ బెంగాల్  నుంచి రూ.30 వేలకు కేజీ చొప్పున తీసుకొచ్చి, ఐదు గ్రాముల ప్యాకెట్లు తయారు చేసి జడ్చర్ల, బాలానగర్ లో వివిధ కంపెనీల్లో పని చేసే కార్మికులకు రూ.300 చొప్పున అమ్ముతున్నట్లు తేలిందన్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.
సీఐ విప్లవ్  రెడ్డి, ఎస్సైలు కార్తీక్ రెడ్డి, నాగరాజు, సిబ్బంది వెంకటయ్య, సురేశ్, పద్మ ఉన్నారు.