వాట్ ఎ డే ఆఫ్ జాయ్.. క్రిస్మస్ను పురస్కరించుకుని రవీంద్రభారతిలో గ్రాండ్ కాన్సర్ట్‌‌‌‌

వాట్ ఎ డే ఆఫ్ జాయ్.. క్రిస్మస్ను పురస్కరించుకుని రవీంద్రభారతిలో గ్రాండ్ కాన్సర్ట్‌‌‌‌

బషీర్​బాగ్, వెలుగు: క్రిస్మస్ సీజన్​కు స్వాగతం చెప్పేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ముందస్తు వేడుకల్లో భాగంగా ప్రముఖ కోరల్ బృందం ద ఫెస్టివల్ కొయర్‌‌‌‌ స్టర్స్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో “వాట్ ఎ డే ఆఫ్ జాయ్” పేరిట గ్రాండ్ కాన్సర్ట్ నిర్వహించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోని బాలాదేవి, రిటైర్డ్ ఐపీఎస్ అరుణ బహుగుణ పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, మాజీ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొని గాయకులను అభినందించారు.