హ‌రిద్వార‌లో సునామీలా క‌మ్మేసిన మ‌బ్బులు

హ‌రిద్వార‌లో సునామీలా క‌మ్మేసిన మ‌బ్బులు

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నఓ వీడియో.. హరిద్వార్‌లో వర్షాకాలంలో ఏర్పడే అద్భుతమైన మేఘాల మనోహరమైన దృశ్యాన్ని చూపిస్తోంది. ఈ వాతావరణ పరిస్థితిని సాధారణంగా 'షెల్ఫ్ క్లౌడ్' అని పిలుస్తారు లేదా కొన్నిసార్లు 'ఆర్కస్ క్లౌడ్'గా సూచిస్తారు. షెల్ఫ్ క్లౌడ్ అనేది ఒక రకమైన లోతట్టు, క్షితిజ సమాంతర మేఘాల నిర్మాణం. ఈ వీడియోను 'అనింద్యా సింగ్' అనే వినియోగదారు ట్విట్టర్‌లో పంచుకున్నారు.

ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న ఈ వీడియో వీక్షకులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ అద్భుతమైన వాతావరణ పరిస్థితికి మంత్రముగ్ధులవుతున్నారు. ఈ ఫుటేజ్ లో మంచుతో కప్పబడిన పర్వతాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్న మేఘాలు అత్యంత ఆకర్షిస్తున్నాయి.   

Shared by a friend. Shot today near Haridwar. Spectacular shelf cloud.

#Manali #Storm #Rain #thunderstorm #shelfcloud pic.twitter.com/he9KXg9qse

— Anindya Singh (@Anindya_veyron) July 9, 2023