ఏం కావాలి నీకు.. కొద్దికొద్దిగడుగు.. అంటున్న త్రిషా

ఏం కావాలి నీకు.. కొద్దికొద్దిగడుగు.. అంటున్న త్రిషా

కమల్ హాసన్ లీడ్ రోల్‌‌‌‌లో మణిరత్నం తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌‌‌‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్‌‌‌‌ లైఫ్‌‌‌‌’.  శింబు, త్రిష కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్ 5న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్స్‌‌‌‌లో భాగంగా బుధవారం ‘షుగర్‌‌‌‌‌‌‌‌ బేబీ’ అనే పాటను విడుదల చేశారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్  కంపోజ్ చేసిన ఈ మెలోడియస్‌‌‌‌ ట్యూన్‌‌‌‌కు తెలుగులో అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.  అలెగ్జాండ్ర జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ తమ వాయిస్‌‌‌‌తో పాటకు స్పెషల్ ఫ్లేవర్‌‌‌‌‌‌‌‌ తీసుకొచ్చారు. 
పాటలోని సాఫ్ట్, మెలోడిక్ బీట్స్‌‌‌‌ ఇంప్రెస్ చేశాయి. ‘‘ఏం కావాలి నీకు, కొద్దికొద్దిగడుగు.. ఇంకేం కావాలి నీకు, స్వర్గం తేనా ఇలకు.. కల్లబొల్లి గుండె కన్నుగీటుతుందే... షుగర్ బేబీ షుగర్ బేబీ..” అంటూ రొమాంటిక్‌‌‌‌గా సాగిన ఈ పాటలో త్రిష డ్యాన్స్‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌, ఫేస్ ఎక్స్‌‌‌‌ప్రెషన్స్‌‌‌‌ ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం ప్యాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా ఈ  చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో ‘థగ్ లైఫ్‌‌‌‌’ టీమ్ బిజీగా ఉన్నారు.  తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట్ మూవీస్ అధినేత ఎన్. సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు.