మోదీని పెద్దన్న అంటే తప్పేముంది : సీఎం రేవంత్ రెడ్డి

మోదీని పెద్దన్న అంటే తప్పేముంది : సీఎం రేవంత్ రెడ్డి

ప్రధాని మోదీని పెద్దన్న అని అంటే తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు. ఆయన దేశానికి ప్రధాని కనుకనే పెద్దన్నగా అభివర్ణించానని పేర్కొన్నారు. ‘‘అమెరికాను బిగ్ బ్రదర్ అని ఎలా అంటారో.. అలాగే ఫెడరల్ స్టేట్స్ ఉన్న దేశంలో ప్రధానిని పెద్ద న్నగా వ్యవహరించాం. అందులో వేరే ఉద్దేశాలు లేవు. ఇందులో ఏదో ఉందని అనుకుంటే ఎలా? నేనేం కేసీఆర్​లా తలుపులు మూసేసి చెవిలో ఏదో చెప్పలేదు కదా. మైక్​లో 4 కోట్ల మందికి వినిపించేలా మాట్లాడాను” అని చెప్పారు. మంగళవారం సెక్రటేరియెట్​లో మీడియాతో రేవంత్ చిట్​చాట్ చేశారు. 

సాగు చేసేటోళ్లకే రైతు భరోసా.. 

ఫామ్​హౌస్​లు ఉన్నోళ్లకు, ట్యాక్స్ పేయర్స్​కు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు. నిజంగా భూములు సాగు చేస్తున్న చిన్న, సన్నకారు రైతులకే రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి, అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.గజ్వేల్, జన్వాడలో ఫాంహౌస్​లు ఉన్నోళ్లకు పెట్టుబడి సాయం అవసరం ఏముంటుందన్నారు. ‘‘గతంలో రాళ్లు రప్పలకు, రహదారులకు రైతుబంధు ఇచ్చారు. కానీ మేం కేవలం భూములు సాగు చేస్తున్న రైతులకే రైతుభరోసా ఇస్తం. సాగు భూములకే పెట్టుబడి సాయం అందజేస్తం” అని పేర్కొన్నారు. 

Also Read : అండర్‌ వాటర్ మెట్రోను ప్రారంభించిన మోదీ