అండర్‌ వాటర్ మెట్రోను ప్రారంభించిన మోదీ

 అండర్‌ వాటర్ మెట్రోను ప్రారంభించిన మోదీ

కోల్‌కతా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తొలి అండర్ వాటర్  మెట్రో రైలును ప్రారంభించారు.  ఈ క్రమంలో మెట్రో సిబ్బంది,  పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ ప్రయాణించారు. కోల్‌కతా  లోని నీటి అడుగున నడిచే రైలుగా ఇది చరిత్రకెక్కనుంది.  హుగ్లీ నది నీటి అడుగున ఈ మెట్రో ట్రైన్ ట్రాక్ ను  నిర్మించారు.   హుగ్లీ నది కింద కోల్‌కతా ఈస్ట్, వెస్ట్ మెట్రో కారిడార్ నుంచి దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ అండర్ రివర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు.  

హౌరా మెట్రో స్టేషన్‌లో దేశంలోనే అత్యంత లోతైన మెట్రో స్టేషన్‌ కలిగి ఉంటుంది. కోల్ కతా నీటి అడుగున నిర్మించిన ఈ మెట్రో రైలులో ప్రతిరోజూ సుమారు 7 లక్షల మంది ప్రయాణిస్తారని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.  లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో కేంద్రం అనేక రాష్ట్రాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టింది బీజేపీ. ఇందులో భాగంగానే నేడు కోల్ కతాలో ఈ అండర్ వాటర్ మెట్రో రైల్ ను మోదీ ప్రారంభించారు.