ట్రెక్కింగ్​కి వెళ్లేవాళ్లు ఏమేం వెంట తీసుకెళ్లాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

ట్రెక్కింగ్​కి వెళ్లేవాళ్లు ఏమేం వెంట తీసుకెళ్లాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

వర్షం పడుతున్న టైంలో పాల నురగల్లాంటి జలపాతాల్ని చూడాలనుకుంటారు చాలామంది. అందుకోసం వాగులు వంకలు దాటుతూ, గుట్టలు, కొండలు ఉన్న దారుల్లో ట్రెక్కింగ్ చేస్తారు. అయితే ఈ సీజన్​లో కొండ ప్రాంతాల్లోని మట్టి రోడ్లన్నీ బురదతో నిండి ఉంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ట్రెక్కింగ్​కి వెళ్లేవాళ్లు ఏమేం వెంట తీసుకెళ్లాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది చెప్తున్నారు  కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అనూప్​ ఖత్రి.

రాళ్లు రప్పలు, బురద లో నడుస్తున్నప్పుడు జారిపడకుండా ఉండేందుకు గ్రిప్​ ఉన్న ట్రెక్కింగ్ షూ వేసుకోవాలి. నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ కోసం చిన్న కర్రలు, హైకింగ్ పోల్స్​  వాడాలి. రాక్​ క్లైంబింగ్, రోప్​ క్లైంబింగ్, ర్యాపెల్లింగ్ వంటి అడ్వెంచరస్​ యాక్టివిటీలు చేసేవాళ్లు తలకు హెల్మెట్​ పెట్టుకోవాలి. మోచేతులు, మోకాళ్లకు గార్డ్స్​ ఉండాలి. 

  • ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు శరీరాన్ని స్ట్రెచ్​ చేస్తుండాలి. దాంతో కీళ్ల దగ్గరి లిగమెంట్స్, టిండాన్స్​ బాగా పనిచేస్తాయి. అంతేకాదు కండరాలు రిలాక్స్​ అయి అలసటగా ఉండదు.  
  • ఎక్కువ దూరం ట్రెక్కింగ్ చేయాల్సి వస్తే... నీళ్లు బాగా తాగాలి. లేదంటే డీహైడ్రేషన్​కు లోనవుతారు. ఒక్కోసారి కండరాలు పట్టేస్తాయి కూడా. అంతేకాదు  అలసటగా అనిపిస్తే  మధ్యలో కొంచెం సేపు ఆగాలి. 
  • ట్రెక్కింగ్​ చేసేందుకు ఎక్కువ ఎనర్జీ కావాలి. అందుకోసం ఎనర్జీ డ్రింక్స్​, గ్లూకోజ్ వాటర్, చాక్లెట్స్ వంటివి తీసుకెళ్లాలి. బ్యాండేజ్, ఐస్​ప్యాక్స్ వంటివి ఉంటే  దెబ్బతగిలితే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవడం ఈజీ అవుతుంది.