లాక్ డౌన్ కొనసాగింపు ఎప్పటివరకు?: సోనియా

లాక్ డౌన్ కొనసాగింపు ఎప్పటివరకు?: సోనియా

న్యూఢిల్లీ: లాక్ డౌన్ ను ఎప్పటివరకు కొనసాగిస్తారనే దానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలతో సోనియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడారు. మే 17 తర్వాత ఏమిటి? ఎలా? లాక్ డౌన్ కొనసాగింపు ఎప్పటివరకు అనే విషయంపై ఏ ప్రాతిపదికన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకెళ్తోందో చెప్పాలని సోనియా ప్రశ్నించారు. రైతులకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె.. ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులను మెచ్చుకున్నారు.

కరోనా వల్ల నెలకొన్న కఠిన, ప్రతికూల పరిస్థితుల్లోనూ భారీ స్థాయిలో గోధుమలను ఉత్పత్తి చేయడం ద్వారా ఫుడ్ సెక్యూరిటీపై భరోసా కల్పించినందుకు ఆ రెండు రాష్ట్రాలకు మప్పిదాలు చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. లాక్ డౌన్ 3.0 తర్వాత ఏం జరగబోతోందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మన్మోహన్ పేర్కొన్నారు. లాక్ డౌన్ నుంచి దేశం బయటపడేందుకు వ్యూహం ఏంటనేది కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అడగాలని వివరించారు.