నేనే పీఎం అయితే యువతకు ఉద్యోగాలిచ్చేవాడిని

నేనే పీఎం అయితే యువతకు ఉద్యోగాలిచ్చేవాడిని

న్యూఢిల్లీ: అభివృద్ధి కేంద్రంగా కాకుండా ఉద్యోగ కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. తాను ప్రధానినైతే నిరుద్యోగుల ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవాడినని ఆయన అన్నారు. యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జనరల్ నికోలస్ బర్న్స్ తో జరిగిన చర్చలో రాహుల్ పైకామెంట్స్ చేశారు. 'నేను ప్రధానినైతే అభివృద్ధి నమూనా స్థానంలో ఉద్యోగ కల్పనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. అభివృద్ధి అవసరమే. కాదనను, కానీ ఉత్పాదకత, ఉద్యోగాల సృష్టి, విలువల సమ్మిళితం కూడా చాలా ముఖ్యం. ఈ విషయంలో చైనాను మెచ్చుకోవాలి. ఏ చైనా నేత కూడా నాతో తమ దేశంలో ఉద్యోగ కల్పనలో సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పలేదు' అని రాహుల్ పేర్కొన్నారు.